TS TET - 2022 OMR Sheet Download Process | టెట్ OMR షీట్ డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2022,
టీచర్ ఉద్యోగ అర్హత పరీక్ష - 2022.
ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్ష TS TET - 2022 కు దరఖాస్తు ప్రక్రియ మార్చి 26, 2022 నుండి ప్రారంభమై ఏప్రిల్ 12, 2002 న ముగిసింది. ఈ అర్హత పరీక్షను జూన్ 12, 2022న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. TS TET - 2022 అర్హత పరీక్ష ఫలితాలను జూలై 1న విడుదల చేశారు. పేపర్-1 లో 32.68 & పేపర్-2 లో 49.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను విడుదల చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఫైనల్ 'కీ' అందుబాటులో ఉంచి అభ్యంతరాలను సైతం స్వీకరించింది. మరియు తాజాగా OMR Sheet డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. TS TET - 2022 ఫలితాలపై సందేహం ఉన్న అభ్యర్థులు, ఆన్లైన్లో OMR Payment - 2022 చెల్లించి డౌన్లోడ్ చేయవచ్చు..
NABARD Grade-A Officers Recruitment 2022 | నాబార్డ్ 170 గ్రేడ్-A ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
★ TS TET - 2022 OMR Sheet డౌన్లోడ్ చేయడం ఎలా?
◆ TS TET - 2022 OMR Sheet డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
● ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
● అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tstet.cgg.gov.in/
● TS TET 2022 నోటిఫికేషన్ పేజీలోని Services విభాగంలోని OMR Payment - 2022 లింక్ పై క్లిక్ చేసి, హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మరియు వెరిఫికేషన్ కోడ్ లను నమోదు చేసి.. కింద కనిపిస్తున్న షరతులకు సంబంధించిన చెక్ బాక్స్ పై క్లిక్ చేసి Submit పై క్లిక్ చేయండి.
● తదుపరి అందుబాటులో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఆధారంగా ఆన్లైన్ పేమెంట్ ₹.15 చెల్లించి, సంబంధిత జనరల్ నెంబర్ను నోట్ చేసుకోండి.
● తదుపరి TS TET 2022 నోటిఫికేషన్ పేజీలోని Services విభాగంలోని Download OMR Sheet - 2022 లింక్ పై క్లిక్ చేయండి.
● OMR డౌన్లోడ్ పేమెంట్ జనరల్ నెంబర్, హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, పేపర్ కోడ్లను నమోదు చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేయండి.
● సంబంధిత పేపర్ కోడ్ OMR షీట్ డౌన్లోడ్ అవుతుంది భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకుని భద్రపరుచుకోండి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
అధికారిక వెబ్సైట్: https://tstet.cgg.gov.in/
● డైరెక్ట్ గా TS TET - 2022 OMR షేర్ఇట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment