TSLPRB SI & PC - 2022 Additionally Qualified Candidates Results Out! | Download here..
తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు - 2022 లో భాగంగా, నోటిఫికేషన్లను విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించి నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే.. ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు ప్రాథమిక పరీక్షను నిర్వహించి, అధికారిక ప్రాథమిక పరీక్ష '' విడుదల చేసి, అనంతరం అభ్యంతరాలను సైతం స్వీకరించి తుది ఫలితాలను ప్రకటించింది.. అయితే రాష్ట్రంలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులు ఉన్న 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లను పరిశీలించిన కోర్టు బహుళ జవాబులు ఉన్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. తాజాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో మరికొంత మంది అభ్యర్థులు అర్హత సాధించే అవకాశం ఉన్నది.
కోర్టు ఆదేశాల ప్రకారం అర్హత సాధించిన వారి జాబితాను, తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ఈనెల 30 నుండి వెబ్సైట్లో వారి వివరాలను ఉంచనున్నారు..
అదేవిధంగా అర్హత సాధించిన అభ్యర్థులు వారి పార్ట్-2 దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుండి 5 మధ్య ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT) ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET) పరీక్షలకోసం హాల్‌టికెట్లను ఫిబ్రవరి 8 నుండి 10 మధ్య డౌన్లోడ్ చేయవచ్చు..
ఫిబ్రవరి 15 నుంచి (PMT/ PET) సామర్థ్య పరీక్షలు హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ మరియు ఆదిలాబాద్ గ్రౌండ్ లలో/ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు.. ఈ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారికంగా ప్రెస్ నోట్ ను 29.01.2023 న విడుదల చేస్తూ అభ్యర్థులకు సూచనలు చేసింది.
తాజా ప్రెస్‌నోట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSLPRB SI & PC - 2022 Additionally Qualified Candidates Results డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 HALL TICKET NUMBERS OF CANDIDATES ADDITIONALLY QUALIFIED IN PRELIMINARY WRITTEN TEST HELD ON 28-08-2022 Police Constable :: Click here.
📌 HALL TICKET NUMBERS OF CANDIDATES ADDITIONALLY QUALIFIED IN PRELIMINARY WRITTEN TEST HELD ON 07-08-2022 SI :: Click here.
అధికారిక వెబ్సైట్ :: https://www.tslprb.in/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment