తెలంగాణ మహిళా సాధికారిత హబ్ లో ఉద్యోగాలు | WDCW DHEW Inviting Applications for MTS Posts | Check Details here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, మహబూబ్ నగర్ జిల్లా హబ్ లో ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ ప్రభుత్వం, మహబూబ్ నగర్ జిల్లా.. మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి జిల్లా మహిళా సాధికారత కేంద్రాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 22.05.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో 11.05.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01,
- MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎకనామిక్స్/ బ్యాంకింగ్ ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600/- నుండి రూ.22,750/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.05.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.05.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
జిల్లా సంక్షేమ అధికారి, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, మహబూబ్నగర్ జిల్లా కార్యాలయం రూమ్ నెంబర్. 36, IDOC.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubnagar.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ :: క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment