కేంద్రీయ విద్యాలయం నుండీ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | KVS Hakimpet Part Time Teaching, Non-teaching Staff Recruitment 2023. Check Details here..
పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు.. కేంద్రీయ విద్యాలయం సికింద్రాబాద్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్-హకీంపేట్ శుభవార్త!
కేంద్రీయ విద్యాలయ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్, 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న పార్ట్ టైం టీచర్ పోస్టుల భర్తీకి నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలను నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై సొంతం చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, ఇంటర్వ్యూలు షెడ్యూల్ మొదలగున్నవి ఇక్కడ.పోస్టుల వివరాలు:
- PGT (English),
- TGT (Hindi),
- Special Educator,
- Student Counsellor.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత,
- B.Ed అర్హత,
- హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధించగల నైపుణ్యం,
- కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మేము చెప్పకూడదు.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన షెడ్యూల్ ఆధారంగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసిన 2 బయోడేటా ఫార్మ్ లను తమతో తీసుకు వెళ్లాలి.
- ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేయబడుతున్నాయి.
- ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం/ సంబంధిత సబ్జెక్టుతో ప్రభుత్వం ఆధారంగా పోస్ట్ భర్తీ అయ్యేంతవరకు(ఏది ముందయితే అది).. కొనసాగవచ్చు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు:
ఇంటర్వ్యూ వేదిక:
- కేంద్రీయ విద్యాలయ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్, సికింద్రాబాద్-500014.
రిజిస్ట్రేషన్ సమయం ::
- ఉదయం 8:30 నుండి 10:30 వరకు.
ఇంటర్వ్యూ సమయం:
- ఉదయం 10:30 నుండి కొనసాగుతుంది.
ఇంటర్వ్యూ తేదీ & రోజు:
- 30.06.2023 (శుక్రవారం).
అధికారిక వెబ్సైట్ :: https://hakimpet.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment