ITI, Diploma, Degree తో శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాలు | BNP Supervisor Permanent Positions Recruitment 2023.
ఐటిఐ, డిప్లోమా, డిగ్రీతో సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ నోట్ ప్రెస్స్(BNP) భారీ నోటిఫికేషన్.
సెక్యూరిటీ ప్రింటింగ్ & మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లిమిటెడ్ పరిధిలోని బ్యాంక్ నోట్ ప్రైస్ వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న సూపర్వైజర్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 21తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ముఖ్య సమాచారం ఇక్కడ.
పోస్టుల వివరాలు:- మొత్తం పోస్టుల సంఖ్య :: 91.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సూపర్వైజర్ (ప్రింటింగ్) - 08,
- సూపర్వైజర్ (కంట్రోల్) - 03,
- సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 01,
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 04,
- జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) - 27,
- జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) - 45,
- జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ-అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్/ లాబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)/ మెకానిస్ట్ గ్రైండర్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్)) - 15,
- జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్) - 03,
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 04,
- జూనియర్ టెక్నీషియన్ (సివిల్/ ఎన్విరాన్మెంట్) - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, బిఈ, బిటెక్, బిఎస్సి ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, దరఖాస్తు గడువు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ పరిక్ష, ధ్రువపత్రాల పరిశీలన, టెస్ట్ ఆధారంగా ఉంటాయి.
ఆన్లైన్ రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, అహ్మదాబాద్, గాంధీ నగర్, వడోదర, బెంగళూరు, బోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్, ముంబై, నవీ ముంబై, తానే, నాగపూర్, పూణే, జైపూర్, లక్నో, కలకత్తా.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే పే స్కేల్ రూ.18,730 - 95,910/- ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- UR/ OBC/ EWS లకు రూ.600/-,
- SC ST లకు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.07.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.08.2023 రాత్రి 11:59 వరకు,
ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించు తాత్కాలిక తేదీ :: సెప్టెంబర్/ అక్టోబర్ - 2023.
అధికారిక వెబ్సైట్ :: https://bnpdewas.spmcil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment