తెలంగాణ టెట్ 2023, నోటిఫికేషన్, దరఖాస్తు విధానం డీ.ఎడ్, బీ.ఎడ్ మిస్ అవ్వకండి TS TET 2023 Notification, Application Process, Important dates..
తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను సైతం ఇప్పటికే ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, పరీక్షా విధానము.. పూర్తి సమాచారం ఇక్కడ..
తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (SCERT), తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలంటే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హత పరీక్షలో క్వాలిఫై మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) రాయడానికి అర్హుత ఉంటుంది. రాబోయే టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ లో సంబంధిత పోస్టులు కొట్టడానికి తప్పనిసరిగా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత అవసరం అలాగే ఈ మర్కులకు 20 శాతం వరకు TRT వెయిటేజ్ ఉంటుంది.
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ఇంటర్మీడియట్ అర్హతతో (డిప్లమా ఇన్ ఎలిమినేట్ ఎడ్యుకేషన్) డీ.ఈడి.
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) బీ.ఈడి పూర్తి చేసి ఉండాలి.
- చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు..
పరీక్ష విధానం:
- టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి.
- డీ.ఎడ్ అర్హత కలిగిన వారు 1 నుంచి 5 తరగతుల వరకు బోధించడానికి పేపర్-1 రాయాలి.
- బీ.ఎడ్ అభ్యర్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ మండలి (NCTE) బీఈడీ అభ్యర్థులకు అనుమతి ఇచ్చింది. వారు పేపర్-1 రాయడానికి అర్హులు.
- మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న (MCQs) రూపంలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
- పేపర్-1 ప్రశ్నాపత్రం స్ట్రక్చర్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- బీ.ఎడ్ అర్హత కలిగిన 6 నుండి 10 తరగతులకు బోధించడానికి పేపర్-2 అర్హత సాధించాలి.
- మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న (MCQs) రూపంలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
- పేపర్-2 ప్రశ్నాపత్రం స్ట్రక్చర్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- 15.09.2023 న పేపర్-1 ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు,
- 15.09.2023 న పేపర్-2 మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిర్వహిస్తారు.
అర్హత మార్కులు:
- జనరల్ లు 60%, 90 మార్కులు,
- బీసీ లు 50%, 75 మార్కులు,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగు లు 40%, 60 మార్కులు.. సాధించాల్సి ఉంటుంది.
- టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) లో TET మార్కులకు వెయిటేజ్ ఉంటుంది.
📌 TET మార్కులకు 20 శాతం, టెట్ మార్కులకు 80% వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
ముఖ్య సమాచారం/ తేదీలు:
- నోటిఫికేషన్ ప్రచూరణ తేదీ : 01.08.2023.
- ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం తేదీ : 02.08.2023.
- ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు ముగింపు తేదీ : 16.08.2023.
- హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం తేదీ : 09.09.2023 నుండి,
- పేపర్-1, పరీక్ష తేదీ, సమయం : 15.09.2023 ఉ.9:30 - మ.12:00.
- పేపర్-2, పరీక్ష తేదీ, సమయం : 15.09.2023 మ.2:30 - సా.05:00.
- ఫలితాల ప్రకటన తేదీ : 27.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://tstet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment