సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | AECS Hyderabad Teacher Recruitment 2023 | Check Eligibility, Salary, Application Process here..
ఉపాధ్యాయ వృత్తి ప్రియులకు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, హైదరాబాద్ శుభవార్త!
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాదులోని ఆటమిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద/కాంట్రాక్ట్/ పీరియడ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ(Pre-Primary Teachers, Primary Teachers, Trained Graduate Teachers) పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ టీచర్ ఉద్యోగాలకు 31-07-2023 ఉదయం 10:00 గంటల నుండి 07-08-2023 సాయంత్రం 03:00 గంటల వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు :- TGT - ఇంగ్లీష్,
- TGT - సోషల్ సైన్స్సైన్స్,
- TGT - హిందీ/ సాంస్క్రిట్,
- TGT - మ్యాథ్స్/ ఫిజికల్ సైన్స్,
- TGT - బయో/ కెమిస్ట్రీ,
- TGT - స్పెషల్ ఎడ్యుకేటర్,
- PRTs - All Subjects,
- PRT - తెలుగ,
- ప్రైమరీ టీచర్.. మొదలగునవి.
TGT పోస్టులకు విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి..
- 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో సంబంధిత సబ్జెక్టులో బిఈడి, డిఈఎల్ఈడీ, పిఈ(ఫిజికల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీతో బిఈడి ఉత్తీర్ణులై ఉండాలి.
PRT పోస్టులకు విద్యార్హత :
- కనీసం 50 శాతం మార్కులతో తెలుగు ఒక సబ్జెక్టు గా ఇంటర్మీడియట్ అర్హతతో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) అర్హత కలిగి ఉండాలి.
Pre-Primary Teacher పోస్టులకు విద్యార్హత:
- కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లమో ఇన్ నర్సరీ టీచర్/ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (D.EI.C.Ed)/ B.Ed (నర్సరీ) అర్హత కలిగి. ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగలరా నైపుణ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే(రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలు) నిర్వహిస్తారు.
వయోపరిమితి :
- 01-04-2023 నాటికి PRT అభ్యర్థులకు 40 సంవత్సరాలు మరియు TGT అభ్యర్థులకు 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అవి;
- SC/ ST లకు 5 సంవత్సరాలు,
- OBC నాన్ క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
- మహిళలకు 10 సంవత్సరాలు,
- దివ్యాంగులకు(PH) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ. 21,250/- నుండి రూ. 26,250/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 31.07.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 07.08.2023 సాయంత్రం 03:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : http://www.aecshyd2.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో అధికారిక వెబ్సైట్ నందు ఉన్న దరఖాస్తు ఫామ్ ను పూర్తిచేసి, ECIL పోస్ట్, D-సెక్టార్ గేట్, DAE కాలనీ ఎంట్రన్స్ హైదరాబాద్ - 500062 నందు గల సెక్యూరిటీ ఆఫీస్ వద్ద ఉంచబడిన బాక్స్ లో డ్రాప్ చేయండి.
లేదా
- Principal Co-ordination Atomic Energy Central School-2, DAE Colony, ECIL Post, Hyderabad - 500062.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment