Anganwadi JOBs 2024: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 68 Anganwadi NEW! Posts here..
మహిళలకు శుభవార్త!
7వ తరగతి, 10వ తరగతి అర్హతతో సొంత జిల్లా లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక మహిళలకు, మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం నంద్యాల జిల్లా శుభవార్త! చెప్పింది. జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో ఖాళీగా ఉన్నా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- అంగన్వాడీ కార్యకర్తలు (AWW)-06,
- మినీ అంగన్వాడి కార్యకర్తలు (Mini-AWW)-02,
- అంగన్వాడీ సహాయకురాలు/ఆయాలు (AWH60..
ఇలా మొత్తం 68 పోస్టులకు స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 21.10.2024 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవాలి. అలాగే సమర్పించిన అభ్యర్థులు రసీదు పొందడం మరవవద్దు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 68.
పోస్టుల వివరాలు:
- అంగన్వాడీ టీచర్ (కార్యకర్తలు)(AWW) - 06,
- మినీ అంగన్వాడీ టీచర్ (కార్యకర్తలు)(Mini-AWW) - 02,
- అంగన్వాడీ సహాయకురాలు/ ఆయాలు (AWH) - 60.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
- అభ్యర్థి తప్పనిసరిగా..
- అంగన్వాడి కార్యకర్త పోస్ట్ కొరకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు 7వ తరగతి తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి.
- అలాగే వివాహితులై స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2024 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాల కు మించకూడదు.
- 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కాని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
- 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
- ఎస్సీ/ ఎస్టీ ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని యేడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు..
- ఎస్సీ/ ఎస్టీ హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో (మెయిన్/ మినీ) ఎస్సీ/ ఎస్టీల ను మాత్రమే ఎంపిక చేస్తారు.
- అంగన్వాడీ కార్యకర్త/ మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు SC/ ST హాబి టేషన్ నందు స్థానిక కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా.. ప్రాతిపదికన ఎంపిక ఇంటర్వ్యూలు లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- అంగన్వాడీ టీచర్ (కార్యకర్త) కు రూ.11,500/-,
- మినీ అంగన్వాడీ టీచర్ (కార్యకర్త) కు రూ.9,000/-,
- అంగన్వాడి సహాయకులకు రూ.7,000/-.
ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి చే అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.
- పుట్టిన తేదీ/ వయసు ధ్రువీకరణ పత్రము.
- నివాసం స్థానికత కోసం.. నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్స్/ రేషన్ కార్డు/ ఆధార్ మొదలగునవి.
- 10వ తరగతి మార్కులు మెమో.
- కుల ధ్రువీకరణ పత్రం.
- దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్.
- వితంతువు అయినచో తగు సర్టిఫికెట్.
- ఇటీవల ఫోటో సిగ్నేచర్..
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.10.2024 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది :: 21.10.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూలను నిర్వహించు తేదీ :: త్వరలో ప్రకటిస్తారు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారిణి, నంద్యాల జిల్లా.
అధికారిక వెబ్సైట్ :: https://nandyal.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నమూనా దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment