Job Mela తెలంగాణలోని మరియొక జిల్లాలో ఈనెల 8వ తేదీన జాబ్ మేళా | టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు గల స్త్రీ, పురుష అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు..
ఆదర్శ నెక్స కార్ షోరూమ్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబాబాద్, రూరల్ రిసెప్షనిస్ట్ మేనేజర్/ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ గా పని చేయుటకు ఆసక్తి కలిగిన స్త్రీ పురుష అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు ఈ నెల 8వ తేదీ మంగళవారం నాడు మహబూబాబాద్ జిల్లా లోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీ ఆర్ డి యెస్ వి.రామకృష్ణ గారు పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు డిగ్రీ పాసైన అభ్యర్థులు, నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఎంపిక కాబడిన అభ్యర్థులకు ₹.10,000/- నుండి ₹.15.000/- వేల వరకు + ఇన్సెంటివ్స్ కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ: 08.03.2022 న నిర్వహిస్తున్న టువంటి ఈ జాబ్ మేళా కు హాజరై ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు శ్రీ కె మహేష్ గారిని ఫోన్ నెంబర్ ద్వారా 8897476633 సంప్రదించవచ్చు.
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ బయోడేటా ఫామ్,
◆ ఆధార్ కార్డ్,
◆ అర్హత ధ్రువపత్రాలు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ ఆదాయ ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంకు బుక్ జిరాక్స్,
◆ డ్రైవింగ్ లైసెన్స్,
◆ సంబంధిత ఫీల్డ్ లో అనుభవం ఉన్నవారు అనుభవం సర్టిఫికెట్ తో, ఇంటర్వ్యూ లో పాల్గొనవచ్చు.
ఇంటర్వ్యూ వేదిక: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం.
ఇంటర్వ్యూ తేదీ: 08.03.2022.
Comments
Post a Comment