Teachers Online Certificate Course on Space Technology || ఉపాధ్యాయులకు ఇస్రో అంతర్జాల శిక్షణ తరగతులు.. రిజిస్టర్ అవ్వండిలా...
ఉపాధ్యాయులకు ఇస్రో అంతర్జాల శిక్షణ
అంతరిక్ష సాంకేతికతపై తరగతులు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ఉపాధ్యాయులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఉపాధ్యాయులు తమ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవడానికి, అంతరిక్షంపై అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉచితంగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇస్రో పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) వారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేయగా తరగతుల నిర్వహణకు ఈ నెల 5 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవగా 30వ తేది వరకు అవకాశం ఉంది.
ఈ నెల 31 నుంచి తరగతులు : 2007 నుంచి ఇస్రో నిర్వహిస్తున్న ఆన్లైన్ కోర్సులు ఇప్పటి వరకు 76 పర్యాయాలు నిర్వహించారు. ఇందులో దేశ వ్యాప్తంగా 3.05 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సారి కూడా విజయ వంతంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అంతర్జాలంలో https:///www.iirs.gov.in/EDUSAT-news లింక్ ద్వారా చరవాణి, జీమెయిల్, పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్ఛునమోదు చేసుకున్న వారికి ఈ నెల 31 నుంచి వచ్చే 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో 70 శాతం హాజరు నమోదు ఉంటూ ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్ ద్వారా ధ్రువపత్రం అందుతుందని జిల్లా సైన్సు అధికార బృందం పేర్కొన్నది.
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు 10,389 మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులున్నారు. వీరిలో 9 నుంచి 12వ తరగతి వరకు గణితం, భౌతిక, జీవశాస్త్రం బోధించే వారు 2500 మందికి పైగా ఉంటారు. ఇలాంటి వారందరికీ అంతరిక్ష సాంకేతికత పరిజ్ఞానం, వాటి అనువర్తనాలు అనే అంశంపై తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి, వాతావరణ సమాచారం, దూరవిద్య, పర్యావరణం, శీతోష్ణస్థితిపై అధ్యయనం, ఆహారం, నీటి భద్రత, ప్రకృతి వైపరీత్యాలు అనే ఉప అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించేలా తరగతులు ఉంటాయి.
ఇది కూడా చదవండి: Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...
➤ అదికారిక వెబ్ సైట్ లింక్: https://www.iirs.gov.in/ & https://elearning.iirs.gov.in/
➤ అంతరిక్ష సాంకేతికత తరగతుల కు రిజిస్టర్ అవ్వడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
➤ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 05.05.2021
➤ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లకు చివరి తేదీ: 30.05.2021
➤ ఆన్లైన్ శిక్షణ తరగతులు వ్యవది: 31.05.2021 నుండి 04.06.2021 వరకు.
టీచర్ డాటా ను ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేసుకునే విధానం. లైవ్ డెమో వీడియొ👇
➤ ఉపాధ్యాయులకు ఇస్రో అంతర్జాల శిక్షణ తరగతుల బ్రోచర్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
➤ ఇస్రో అంతర్జాల శిక్షణ తరగతులకు సంభందించిన గైడ్ లైన్స్ ను: ఇక్కడ చదవండి.
➤ కోర్సు షెడ్యూలే ను డౌన్లోడ్ చేసుకోవడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.








































Comments
Post a Comment