TTWREIS COEs/ Junior Colleges Inter first year for Acad yr 2022-23 Entrance Test Hall-Tickets Released | Download here..
తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు ఇంటర్ మొదటి సంవత్సరం అకడమిక్ ఇయర్ 2022-23, ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఈ నెల 27న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01గంట వరకు నిర్వహించనుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://tgtwgurukulam.telangana.gov.in/
◆ మెయిన్ పేజీ లోనే లేటెస్ట్ నోటిఫికేషన్స్ లో స్క్రోల్ అవుతున్న ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన లింక్పై క్లిక్ చేయండి.
◆ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆ దరఖాస్తు సమయంలో నమోదు చేసినటువంటి పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్లను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
◆ తీసుకొని భద్రపరుచుకోండి.
ఈ ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహిస్తున్నారు, గమనించగలరు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:
● ప్రవేశ పరీక్ష హాజరవుతున్న విద్యార్థులు నిర్దేశించిన హాల్టికెట్ తో ఒక గంట ముందు పరీక్ష సెంటర్ కు చేరుకోవాలి.
● ఈ పరీక్ష ఓఎంఆర్ ఆధారంగా నిర్వహిస్తారు.
● ఓఎంఆర్ సమాధాన పత్రంలోని వృత్తాలను బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను తో మాత్రమే పూరించాలి.
● ఒక ప్రశ్నకు ఒకటి కన్నా ఎక్కువ వృత్తాలను పూజించరాదు, అలా చేసిన ఎడల ఆ ప్రశ్నల సమాధానాలకు మార్కులు కేటాయించబడవు.
అధికారిక వెబ్సైట్: https://tgtwgurukulam.telangana.gov.in/
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment