TS V-TG CET-2022 | తెలంగాణ గురుకుల 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన-2022 | దరఖాస్తు ఆన్లైన్ లో సబ్మిట్ చేసే విధానం వీడియో.. | అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..
తెలంగాణ ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 5వ తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటనను (V-TG) CET - 2023 విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 602 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సాంఘిక సంక్షేమ గురుకులాలు 230, గిరిజన సంక్షేమ గురుకులాలు 76, మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకులాలు 261, TREIS-జనరల్ గురుకులాలు 35 ఉన్నాయి.
కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా ఈ ప్రవేశపరీక్ష V-TG CET-2022 కు ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం వీడియో ఇక్కడ చూడండి.
◆ అర్హత ప్రమాణాలు:
◆ 2021-22 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి.
◆ విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2,00,000 లక్షలకు మించకూడదు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1,50,000 వేలకు మించకుండా ఉండాలి.
◆ విద్యార్థి వయసు: 9సంవత్సరాలు2 నుండి 11 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
◆ ఎంపిక విధానం:
◆ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ ఈ పరీక్ష తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
◆ తెలుగు, ఇంగ్లీష్, గణితం, మెంటల్ ఎబిలిటీ(మానసిక సామర్థ్యం), పరిసరాల విజ్ఞానం మొదలగు అంశాల నుండి మూడు నాలుగవ తరగతి స్థాయిలో పరీక్ష పేపరు ఉంటుంది.
◆ ఈ పరీక్ష 100 మార్కులకు నిర్వహించారు.
◆ పరీక్ష పేపర్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది.
◆ పరీక్ష సమయం 2గంటలు.
◆ పరీక్షా కేంద్రాలు:
◆ సంబంధిత జిల్లా అధికారులతో నిర్ణయించబడిన పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడును.
◆ దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.03.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.03.2022.
అధికారిక వెబ్సైట్: https://tgcet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం ఈ వీడియో చూడండి.
Comments
Post a Comment