Mega Job mela 2021 || Generate Gate Pass here..
జనవరి 6న మెగా ఉర్దూ జాబ్ మేళా:
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ హైదరాబాద్ సహకారంతో మెగా ఉర్దూ జాబ్ మేళాను జనవరి 6న స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌళిలోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండి యాకూబ్ తెలిపారు. 18నుంచి 35 సంవత్సరాల లోపు ఉర్దూ మాధ్యమంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ప్రభుత్వం గుర్తింపు పొందిన మదరసాలో చదువుకున్న వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు.
వివరాలకు ఫోన్ నంబర్ 0870-2980533కు సంప్రదించాలన్నారు.
ఉర్దూ అకాడమీ ఆధ్వర్యలో ఆన్లైన్ కోర్సులు:
ఉర్దూ అకాడమీ ఆధ్వర్యలో ఆన్లైన్ కోర్సులకు లింకను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో పలు ఆన్లైన్ కోర్సుల దరఖాస్తుల లింకను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం ఆవిష్కరించారు. 2021-22 సంవత్సరానికి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు, ఉర్దూ చిన్నపత్రికల రిపోర్టర్లకు, ఉర్దూ పుస్తకాల ప్రచురణ కోసం ఆర్థికసాయం అందజేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఆన్లైన్ కోర్సులకు జనవరి 15లోగా దరఖాస్తు చేసుకోవాలని, హార్డ్ కాపీలను నాంపల్లిలోని కార్యాలయంలో అందజేయాలని అధికారులు తెలిపారు. వివరాలకు http://urduacademyts.com/ సందర్శించింది..
ఎస్టీ పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్:
ఉస్మానియా యూనివర్సిటీ, దేశంలో ఎస్టీ పరిశోధక విద్యార్థుల్లో ఫెలోషిప్ పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంఫిల్, పీహెచ్ డీ చేస్తున్నవారు దరఖాస్తులకు అర్హులని ఓయూ డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జీ మల్లేశం తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 750 మందికి ఫెలోషిప్ మంజూరు చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 31లోగా https://fellowship.tribal.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దివ్యాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ:
ఉమ్మడి జిల్లాలోని దివ్యాంగులకు వర్ధన్నపేటలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు దళిత నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల కుమారస్వామి గురువారం తెలిపారు. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఏపీఏఎస్, బ్యాంకు సహకారంతో 45 రోజుల పాటు శిక్షణ అందించి, ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. పూర్తి వివరాలు కోసం 95056 82726 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.







































Comments
Post a Comment