Atomic Energy Central School Teaching Staff Recruitment 2021 || హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో టీచర్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నుండి 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద ప్రాతిపదికన PRT-Telugu మరియు TGT పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
1. PRT - Telugu,
2. TGT - PET - Female,
3. TGT - English,
4. TGT - Social Science,
5. TGT - Hindi/ Sanskrit.
TGT పోస్టులకు విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో సంబంధిత సబ్జెక్టులో బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా
కనీసం 50 శాతం మార్కులతో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీతో బీఈడీ ఉత్తీర్ణులైనవారు డాలి.
వయసు: జూలై 1, 2021 నాటికి పురుషులకు 45 సంవత్సరాలు, స్త్రీలకు 55 సంవత్సరాలు, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ/ కేంద్రీయ విద్యాలయ/ నవోదయ విద్యాలయ రిటైర్ సిబ్బందికి 65 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: 26,250/-.
PRT తెలుగు పోస్టులకు విద్యార్హత:
ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్ట్ తో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ గ్రాడ్యుయేట్ తో బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: జూలై 1, 2021 నాటికి పురుషులకు 40 సంవత్సరాలు, స్త్రీలకు 50 సంవత్సరాలు, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ/ కేంద్రీయ విద్యాలయ/ నవోదయ విద్యాలయ రిటైర్ సిబ్బందికి 65 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: 21,250/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
చిరునామా: సెక్యూరిటీ ఆఫీస్, డిఎఈ కాలనీ, డి-సెక్టార్ గేట్, కమలా నగర్, హైదరాబాద్-500062.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.07.2021,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు.
రాత పరీక్ష విధానం:
స్క్రీనింగ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది. సంబంధిత సబ్జెక్టు నుండి 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష సమయం: 90 నిమిషాలు.
పరీక్ష సెంటర్: అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్-2, డిఎఈ కాలనీ, ఈసిఐఎల్ పోస్ట్, హైదరాబాద్-500062.
పరీక్ష తేదీ: జూలై 16, 17 తేదీల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
గమనిక: అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ/ కేంద్రీయ విద్యాలయ/ నవోదయ విద్యాలయ రిటైర్డ్ టీచర్లకు ఎటువంటి పరీక్ష లేదు.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
నోటిఫికేషన్ పూర్తిన్ వివరాలు వీడియొలో
అధికారిక వెబ్సైట్: http://www.aecshyd2.edu.in/
అధికారిక నోటిఫికేషన్:
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫారం:








































Comments
Post a Comment