TS EAMCET 2021: Engineering Pharmacy Admissions Slot booking Started | Easy to book your slot Userc guide Available here..
ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ సోమవారం (30.08.2021) నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి వచ్చేనెల 9వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ 4నుంచి 11వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు.
సెప్టెంబర్ 4నుంచి 13వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశ ముంటుందని తెలిపారు.
సెప్టెంబర్ 15న తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
ఇతర వివరాల కోసం https://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
ఇంజనీరింగ్ సీటును ఆన్లైన్ లో బుక్ చేయండిలా...
ఇంటి నుంచే ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్న ఉన్నత విద్యామండలి,
స్లాట్ బుకింగ్ నుంచి కాలేజీలో చేరేదాకా వివరాలన్నీ వెబ్సైట్లో...
ఎంసెట్ ఇంజనీరింగ్ కొన్సెలింగ్ షెడ్యూల్
ఖరారైన నేపథ్యంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం సహాయ
కేంద్రానికి వెళ్లడం మినహా మిగతావన్నీ ఇంట్లోంచే ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చని
ఉన్నత విద్యామండలి తెలిపింది. స్లాట్ బుకింగ్ నుండి కాలేజీలో జాయిన్ అయ్యే వరకూ విద్యార్థులు ఏం చేయాలనే వివరాలను అదికారిక వెబ్సైట్లో ఉంచుతారు.
ముందు ఇలా చేయండి
ఆగష్టు 30వ తేదీ నుంచి
కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
వచ్చే నెల 9వ తేదీ వరకూ ఎంసెట్ అర్హత పొందిన అభ్యర్థులు https://tseamcet.nic.in పేజీకి లాగిన్ అవ్వాలి. అక్కడ రిజి స్టేషన్ కాలమ్‌లోకి వెళ్లాలి.
ఎంసెట్ హాల్ టికెట్, పుట్టిన తేదీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష హాల్‌టికెట్ నంబర్‌ను నిర్జీత కాలమ్‌లో నింపాలి. ఇందులోనే ఆధార్, మొబైల్, కుల ధ్రువీకరణ పత్రం నంబర్ లను ఇవ్వాలి. ఇచ్చిన మొబైల్. నంబర్ చివరి వరకూ ఉంటుంది. మార్చడం కుదరదు.
ప్రాథమిక సమాధారం పొందుపరిచిన తర్వాత రూ. 1,200 (ఎస్సీ, ఎస్టీలు రూ. 600) ఫీజు ఆన్లైన్ ద్వారానే ' చెల్లించాలి. అప్పుడు మీ పేరుతో అకౌంట్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా సర్టిఫికెట్ పరిశీలన తేదీ, దగ్గర్లోని కేంద్రాన్ని మరియు సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొదటి మెట్టు పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్‌నకు ఆగష్టు 30 నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకూ అవకాశం.
పరిశీలనకు ఏయే సర్టిఫికెట్లు కావాలి?
మీరు ఎంచుకున్న సహాయ కేంద్రానికి టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, అధార్ ఎస్సెస్సీ తత్సమాన మార్కుల మెమో, ఇంటర్ మెమో, ఆరు నుంచి ఇంటర్ వరకూ స్టడీకేర్టిఫికట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవన్నీ ఒరిజినల్స్‌తోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి.
సర్టిఫికెట్ల పరిశీలన వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ. వరకూ
కొనసాగుతుంది. సహాయ కేంద్రంలో దృవ పాత్రల పరిశీలన అనంతరం సంబంధిత అధికారి
ధ్రువీకరించినట్టు రసీదు ఇస్తారు.
అప్షన్ వేళ కంగారొద్దు.
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత తిరిగి టీఎస్ఎంసెట్ పేజీకి మీ యూజర్ వడీ్ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్పుడు అష్షన్స్ను ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు ఎంసెట్ వెట్ పోర్టల్‌లోనే ఉంటాయి. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలుస్తుంది. ఆ కాలేజీ కోడ్ పక్కనే ఉంటుంది. జిల్లాలవారీగా కాలేజీల వివరాలూ ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకొనే కోర్టు, కాలేజీ కోడ్ ముందుగా రాసుకొని ఆ తర్వాత వెబ్‌లో క్లిక్ చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వరుస క్రమంలో ప్రాధాన్యతను ఎంపిక చేసుకున్న తర్వాత డేటాను సట్మిట్ చేయాలి.
అష్టన్స్ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు ప్టెంబర్ 1౩ రాత్రి వరకూ ఉంటుంది. రాత్రి 12:00 గంటల తరువాత సైట్ ఫ్రీజ్ అవుతుంది. ఇక ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు.
15న సీటు ఖరారు...
స్టెంబర్ 15వ తేదీన తొలిదశ సీట్ల కేటాఇంపు ఉంటుంది. అభ్యర్థి తన ఐడీకి లాగిన్అయి సీటు వచ్చిందా లేదా! చూసుకోవచ్చు. సీటొస్తే కేటాయింపు ఆర్దర్‌ను. డొన్లోడ్ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న ఫీజును సెప్టెంబర్ 20వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
సీటు రాని పక్షంలో మళ్లీ రెండో దళ వెబ్ ఆప్షన్ కు వెళ్లొచ్చు. ఈసారి ఎలాంటి. ఎంట్రీ ఫీజు ఉండదు. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే. అభ్యర్థి కాలేజీకి వెళ్లి. ఒరిజినల్ సర్జిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
ఇదీ షెడ్యూల్...
స్లాట్‌బుకింగ్ 30-08-21 నుంచి 09-09-21
ధ్రువపత్రాల పరిశీలన: సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు,
వెబ్ ఆప్షన్స్: సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు,
తొలిదశ సీట్ల కేటాయింపు: 15-09-21,
సెల్ఫ్ రిపోర్టింగ్ 20-09-21.
అదికారిక వెబ్సైట్: https://tseamcet.nic.in/ & https://eamcet.tsche.ac.in/
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment