Union Bank of India Recruitment 2021 | Apply 347 Vacancies | Check Eligibility Criteria and more details here...
యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 20 21:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ప్రధాన కార్యాలయం మరియు పాన్ ఇండియా ఉనికి కలిగిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్పెషలైజ్డ్ లో ఖాళీగా ఉన్న 347 ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ పేజీలో చదవండి...
యూనియన్ బ్యాంక్ ఉద్యోగ నియామకము 2021-22: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ స్పెషలైజ్డ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రత్యేక నైపుణ్యం అవసరమని ఉన్న విభాగంలో ఈ క్రింది ఉద్యోగాలకు నియామకం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టుల వివరాలు:
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సీనియర్ మేనేజర్(రిస్క్) - 60,
2. మేనేజర్(రిస్క్) - 60,
3. మేనేజర్(సివిల్ ఇంజనీర్) - 7,
4. మేనేజర్(ఆర్కె టెక్) - 7,
5. మేనేజర్(ఎలక్ట్రికల్ ఇంజనీర్) - 2,
6. మేనేజర్(ప్రింటింగ్ టెక్నాలజీ) - 1,
7. మేనేజర్(ఫోర్స్) - 50,
8. మేనేజర్(చార్టెడ్ అకౌంట్) - 14,
9. అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్ ఆఫీసర్) - 26,
10. అసిస్టెంట్ మేనేజర్(ఫోర్స్) - 120...
అర్హత ప్రమాణాలు:
భారతీయ పౌరుడు అయి ఉండాలి.
స్పెషలైజ్డ్ కేటగిరీలో అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవడానికి అర్హులు.
విద్యార్హతలు:
వివిధ రకాల పోస్టులకు వివిధ విద్యార్హతలను కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో స్పెషలైజేషన్ కోర్సు ఉత్తీర్ణతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయసు:
ఆగస్టు ఒకటి 2021 నాటికి అభ్యర్థుల వయసు 20 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అధిక వయసు కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక ప్రక్రియ:
అర్హులైన అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఆన్ లైన్ పరీక్ష విధానం:
★ ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
★ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
★ మొత్తం 4 విభాగాలలో నుండి ప్రశ్నలు అడుగుతారు.
1. రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు.
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు.
3. ప్రొఫెషనల్ నాలెడ్జ్(సంబంధిత పోస్టు) 50 ప్రశ్నలు.
3. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలు.
★ ఇలా మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు
★ పరీక్ష సమయం 2 గంటలు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ పరీక్ష సెంటర్.
దరఖాస్తు ప్రక్రియ:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
★ జనరల్ / ఈడబ్ల్యూఎఫ్ /మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.850.
★ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.09.2021.
అధికారిక వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/ubirscoaug21/
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment