HURL Recruitment 2021 | Apply 513 Posts of Junior Engineer | Freshers can Apply | Check Eligibility Criteria and more details here..
హిందుస్థాన్ ఊర్వరక్ రాష్ట్రీయ లిమిటెడ్లో నాన్-ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు | జీతం-3 లక్షల నుండి 5.8 లక్షల వరకు | బీఈ/ బీటెక్/ బిఎస్సి/ బీకాం/ బిఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల. | పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి...
హిందుస్థాన్ ఊర్వరక్ అండ్ రాష్ట్రీయ లిమిటెడ్ మరియు ఐఓసిఎల్, ఎన్టిపిసి, సిఐఎల్, ఎఫ్సిఐఎల్, హెచ్ఎఫ్సిఎల్ సంస్థల యొక్క అనుబంధ సంస్థ అయిన 'హెచ్యూఆర్ఎల్' వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, జూనియర్ ఎకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్.. విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 513 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు...
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల ఫుల్ టైం డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. మరియు బీఏ/ బీఎస్సీ/ బీకాం అర్హత కలిగి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో ఐదు నుండి పది సంవత్సరాల అనుభవం అవసరం.
విభాగాలు: అమోనియా, యూరియా, ఆప్ సైట్ అండ్ యుటిలిటీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, యూరియా ప్రోడక్ట్ హ్యాండ్లింగ్, ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అసురన్స్ ఇన్స్పెక్షన్ మొదలగునవి..
వయసు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతాల వివరాలు:
★ ప్రెషర్ కు సంవత్సరానికి 3 లక్షలు
★ 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి 4 లక్షలు
★ 10 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి 4.9 లక్షలు
★ 15 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి 5.8 లక్షల వరకు ప్రతి సంవత్సరం జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్) లో సాధించిన మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.08.2021.
అధికారిక వెబ్సైట్: https://hurl.net.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://hurl.onlineregistrationform.org/HURL/
నోటిఫికేషన్ పూర్తి వివ్బరాలు వీడియొలో...
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment