Hyderabad District Medical staff recruitment 2021 || Apply 206, ANM/MPHA(F), Lab Technician Gr-౹౹, Pharmacist Gr-౹౹ check details here..
Covid-19 నేపథ్యంలో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి(డిఎంహెచ్ఓ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది ఉద్యోగాలకు, ఒప్పంద ప్రాతిపదికన నిర్ణీత కాల నియామకాలకు, అర్హత, ఆసక్తి కలిగిన వారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టులు సంఖ్య: 206
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. ANM లో మొత్తం పోస్టులు - 103,
విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత 18 నెలల MPHW(F) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు తో MPHW(F) తిరుమల ఉండాలి. దీనితోపాటు ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్, హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
📢 తెలంగాణ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్ (ఆయా ) పోస్టుల భర్తీ..కి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు చదవండి.
చివరితేది : 31.07.2021👆.
2. ఫార్మాసిస్ట్ గ్రేడ్-౹౹ లో మొత్తం పోస్టుల సంఖ్య - 31,
విద్యార్హత: ఫార్మసీలో డిప్లమా/ డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. మరియు డి ఫార్మసీ ఉత్తీర్ణత కలిగినవారూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
3. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-౹౹ లో మొత్తం పోస్టుల సంఖ్య: 72,
విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో DMLT/ BSC(MLT) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డు లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: జూలై 1, 2021 నాటికి కనీసం 18 సంవత్సరాల వయసు మరియు 34 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి సమాచారం కోసం దిగువ ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక ప్రక్రియ: మొత్తం 100 మార్కులు, దీనిలో 90 మార్కులు క్వాలిఫైయింగ్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా కేటాయించబడి తాయి. మరియు 18 సంవత్సరాల తర్వాత వయస్సుకు 10 మార్కులు ఇవ్వబడతాయి. సంవత్సరానికి 0.5 మార్కులు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.07.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:19.07.2021.
అధికారిక వెబ్సైట్: http://dmhohyd.onlineportal.org.in/
అధికారిక నోటిఫికేషన్:
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: http://dmhohyd.onlineportal.org.in/Content/frmPaymentProcedure.aspx
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here








































Comments
Post a Comment