KVS Bolarum Secunderabad Teaching Staff Recruitment 2921 | Apply Various OGT TGT PRT DOCTOR NURSE COUNSELLOR YOGA TEACHER DATA ENTRY OPERATOR and more | Cgeck eligibility criteria and Download Application Form here...
సికింద్రాబాద్ లోని బొల్లారం కేంద్రీయ విద్యాలయ నుండి పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
కేంద్రీయ విద్యాలయ బొల్లారం, సికింద్రాబాద్ నుండి ఒప్పంద ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్ల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది..
ఇంటర్వ్యూ తేదీ: 02.11.2021..
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు..
దిగువ తెలిపిన టువంటి టీచర్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి కేంద్రీయ విద్యాలయ బొల్లారం, ఆహ్వానం..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక బయోడేటా ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత ధ్రువపత్రాలను దానితో జత చేసి ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే నాడు తమతో తీసుకు రావాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు..
అధికారిక బయోడేటాను ఇక్కడ డౌన్లోడ్ చేయండి..
పోస్టుల వివరాలు:
1. పి జి టి (జియోగ్రఫీ),
2. పి జి టి (హిస్టరీ),
3. టి జి టి (హిందీ),
4. టి జి టి (సోషల్ సైన్స్).. మొదలగునవి.
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల విద్యార్హతలను సూచించారు.. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంటిగ్రేటెడ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఎం.ఎ /ఎం.ఎస్సి లను గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, బీఈడీ అర్హతను కలిగి ఉండాలి.
మరియు హిందీ ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
పైన తెలిపిన పోస్టులకు నవంబర్ 2, 2021 వ తేదీన ఉదయం 8:30 గంటలనుండి 10:30 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కేంద్రీయ విద్యాలయ బొల్లారం వారు సూచించిన టువంటి బయోడేటా ఫామ్ పూర్తి చేసి సంబంధిత దరఖాస్తు పత్రాలతో హాజరవ్వాలి..
జీతాల వివరాలు:
1. పి జి టి - 27,500/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
2. టి జి టి - 26,250/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
3. ప్రైమరీ టీచర్లకు - 21,250/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
4. డాక్టర్లకు - ప్రతి రెండు గంటలకు 1000/- 1000 రూపాయలు జీతంగా చెల్లిస్తారు.
5. నర్స్ లకు - ప్రతి ఏడు గంటలకు 750 రూపాయలు జీతంగా చెల్లిస్తారు.
6. డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు - రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15,000/-జీతంగా చెల్లిస్తారు..
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. కొవిడ్ నియమాలను పాటిస్తూ శానిటైజర్, మాస్ కలను ధరించి.. ఇంటర్వ్యూలకు హాజరు కావలసిందిగా కేంద్రీయ విద్యాలయ బొల్లారం, సికింద్రాబాద్ ప్రకటనలో సూచించారు.
అధికారిక వెబ్సైట్: https://bolarum.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment