TCS Recruitment 2022 || Graduate may apply online || last date is 16.01.2021.. Register here..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రాం ద్వారా 35 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
భారతదేశ అతిపెద్ద ఐటి సంస్థ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ (TCS) గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తాజాగా ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రాం ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దరఖాస్తులకు చివరి తేదీ:16-01-2022.
విద్యార్హతలు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బిసిఎ, బిఎస్సి(మ్యాప్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఐఐటీలో బ్యాచిలర్ ఇన్ ఒకేషనల్ మొదలగు విద్యార్హతల లో 2020, 2021,2022.. మొదలగు విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
పరీక్ష విధానం: మొత్తం మూడు విషయాలు నుండి ప్రశ్నలు అడుగుతారు.
1. వర్చువల్ ఎబిలిటీ నుండి 24 ప్రశ్నలు.
2. రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు.
3. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 26 ప్రశ్నలు..
ఇలా మొత్తం 80 ప్రశ్నలు.. ఈ పరీక్షలో అడుగుతారు.
పరీక్షా సమయం 120 నిమిషాలు.
రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్. https://www.tcs.com/
2. రిజిస్టర్ అవ్వడానికి డైరెక్ట్ లింక్ ఇదే. https://www.tcs.com/careers/tcs-smart-hiring
3. ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి;
అవి 1. ఐటీ, 2. బిపిఎస్.
4. సంబంధిత లింక్ పై క్లిక్ చేయగానే, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన న్యూ ఫేజ్ ఓపెన్ అవుతుంది.
5. రిజిస్ట్రేషన్ లో భాగంగా.. పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, విద్యార్హత వివరాలను నమోదు చేసి, తదుపరి పాస్వర్డ్ను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
6. విజయవంతంగా రిజిస్టర్ అయిన వారు మీ వివరాలను ట్రేస్ చేయండి..
7. Applied for Drive ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతమైనట్లు..
అధికారిక వెబ్సైట్: https://www.tcs.com/
అధికారిక నోటిఫికేషన్: https://www.tcs.com/careers/tcs-smart-hiring
రిజిస్ట్రేషన్ చేయడానికి డైరెక్ట్ లింక్: https://nextstep.tcs.com/campus/#/registrationPage
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment