Indian Railway JOBs 2022 | రైల్వేలో 9,248 ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | పూర్తి వివరాలివే..
భారతీయ రైల్వే, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అప్రెంటిస్ నియామకానికి నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉన్నాయి.. తాజాగా N.F.Railway మరియు Western Railway లు 9,248 అప్రెంటిస్ నియామకానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన మార్పుల ఆధారంగా ఎంపికలు నిర్వహించే, అప్రెంటిస్ ఉద్యోగాలు కల్పించడానికి, భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేశాయి.
మొత్తం ఖాళీల సంఖ్య: 9,245.
రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు:
◆ Northest Frontier Railway - 5636,
◆ Western Railway - 3612.
★ Northest Frontier Railway అప్రెంటిస్ నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2022.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://nfr.indianrailways.gov.in/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ తదుపరి, జనరల్ ఇన్ఫో పై క్లిక్ చేయండి
◆ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ GHY లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తులను సమర్పించండి.
★ Western Railway అప్రెంటిస్ నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.05.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ: 27.06.2022.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://wr.indianrailways.gov.in/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ తదుపరి, న్యూస్, అప్డేట్స్, & రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇక్కడ సంబంధిత లింక్స్ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి.
ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి, అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్/ 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలతో, సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ NCVT/ SCVT నుండి కలిగి ఉండాలి.
వయో- పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్లు చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.100/-.
రిజర్వేషన్ వర్గాల వారైనా ఎస్సీ /ఎస్టీ/ దివ్యాంగులు & మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఉపయోగాలు:
◆ సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్షిప్ చేయడంవల్ల, భవిష్యత్తులో వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్ లలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ప్రత్యేక వెయిటేజీ కల్పిస్తూ, ప్రాధాన్యతనిస్తారు.
◆ ఉద్యోగ రిక్రూట్మెంట్లో భాగంగా టెక్నికల్ విద్యార్హత కు, అప్రెంటిస్షిప్, ఇంటర్వ్యూ లకు మార్కుల వెయిటేజీ కల్పిస్తారు.
◆ కాబట్టి, ఈ రకమైనటువంటి అప్లికేషన్లను దరఖాస్తులు చేసుకుని, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ లో విజయవంతం అవ్వండి..
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment