JOB Alert | ఇంటర్ తో 100 కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ ఖాళీల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!.
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రేపు అనగా 09.06.2022 న, Ebixcash Global Service Hyderabad. కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ ఈ విభాగంలో ఖాళీగా ఉన్నా 100 పోస్టుల భర్తీ కొరకు, ఇంటర్ అర్హత కలిగి, 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సోమాజిగూడ నందు విధులు నిర్వర్తించ వలెను. వీరికి గౌరవ వేతనం గా ₹.11,000 - ₹12,000/-జీతం చెల్లిస్తారు.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, ఇంటర్వ్యూ సమయము నందు తమతో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల వివరాలు, మొదలగునవి మీకోసం.
◆ సంస్థ పేరు: Ebixcash Global Service Hyderabad.
◆ ఉద్యోగ ఖాళీలు: 100.
అర్హత ప్రమాణాలు:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఏదైనా గ్రూప్ లో ఇంటర్ పాసైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు..
◆ 19-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
◆ ఎలాంటి రాత పరీక్ష లేదు,
◆ కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం: ₹.11,000/- నుండి ₹.12,000/-వరకు.
జాబ్ లొకేషన్: సోమాజిగూడ, హైదరాబాద్.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ పూర్తి చేసిన వ్యక్తిగత బయోడేటా ప్రొఫార్మా.
◆ 2 కలర్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
◆ స్టడీ సర్టిఫికేట్.
◆ ఆధార్ కార్డ్.
◆ రేషన్ కార్డ్.
◆ కుల ధ్రువీకరణ పత్రం.
◆ బ్యాంకు బుక్.
ఇంటర్వ్యూ వేదిక:
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కొత్తగూడెం (మున్సిపాలిటీ ఆఫీస్ కాంప్లెక్స్).
సమయం: ఉదయం 10:00 గంటల నుండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, సందేహాల నివృత్తి కోసం 7995806182, 779947081 సంప్రదించండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment