L&T Job Mela 2021 | L&T ITI Mega Job Mela 2021 | ICICI Job Mela 2021 | ICICI Recruitment Agency PRO Jb Mela 2021 | ICICI Degree Job mela 2021 | Check all the Eligibility details here..
1. ప్రభుత్వ ఐటిఐ లో జాబ్ మేళా..
2. ఐసిఐసిఐ అధికృత రిక్రూట్మెంట్ ఏజెన్సీ పిఆర్వో ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన మహబూబాబాద్ లోని స్థానిక సమైక్య డిగ్రీ కళాశాల లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారం చదవడానికి ఈ పేజీను చివరివరకు చదవండి..
కాకతీయ కాలనీ ములుగు రోడ్డు లోని ప్రభుత్వ ఐటిఐ బాలుర కళాశాల లో అక్టోబర్ 29, 2021 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జాంమ్లా నాయక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్ అండ్ డి కంపెనీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్.. తదితర ట్రేడ్ లను పూర్తి చేసి ఉండాలని.. అలాగే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని ఆయన సూచించారు..
ఈ జాబ్ మేళా కు ఎంపికైన అభ్యర్థులు కాంచీపురం, చెన్నైలో మూడు నెలలు శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత అనంతరం హైదరాబాద్, విశాఖపట్టణం లో ఉద్యోగ నియామకాలు చేపడతారని.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాంమ్లా నాయక్ గారు కోరారు.
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు:
1. ఎస్ఎస్సి మెమో,
2. ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్,
3. ఆధార్ కార్డ్,
4. కుల ధ్రువీకరణ పత్రం,
5. 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,
6. బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదలైనవి వాటితో హాజరు కావాలని తెలిపారు.
ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ ప్రకటన హలో తెలిపారు..
మరియొక జాబ్ మేళా సమాచారం...
ఐసిఐసిఐ అధికృత రిక్రూట్మెంట్ ఏజెన్సీ పిఆర్వో ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన మహబూబాబాద్ లోని స్థానిక సమైక్య డిగ్రీ కళాశాల లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ చదివి ఉండాలని.. అలాగే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలని ప్రకటనలో తెలిపారు..
అక్టోబర్ 29, 2021 న(శుక్రవారం) ఉదయం 10 గంటలకు జరిగే జాబ్ మేళాకు అర్హత, ఆసక్తి కలిగిన గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.
వివరాల కోసం : 9059887688 ఈ నెంబర్ ను సంప్రదించాలన్నారు..
ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తగు ధ్రువీకరణ పత్రాలతో రావాలని... ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు..
Comments
Post a Comment