పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో పర్మినెంట్ సెక్యూరిటీ గార్డుల నియామకానికి ప్రకటన | ఖాళీల వివరాలు | ఎంపిక విధానం | దరఖాస్తు విధానం | ఇక్కడ తనిఖీ చేయండి.
భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ పదవ తరగతి విద్యార్హతతో 220 సెక్యూరిటీ గార్డుల నియామకానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 202,
విభాగాల వారీగా ఖాళీలు: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 19 రాష్ట్రాల నుండి 202 ఖాళీలను భర్తీ ప్రకటించారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను ఈ పేజీ దిగువన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
అర్హత ప్రమాణాలు:
● జూలై 1 2021 నాటికి పదవ తరగతి ఉత్తీర్ణత తో ఆర్మీ/ నీవి/ ఎయిర్ పోర్ట్ నుండి మాజీ సైనికుల ఉండాలి.
● ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
● సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేయడానికి శారీరకంగా ఫిట్ గా ఉండాలి.
● లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు:
● 26 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
● సంబంధిత విభాగంలో దేశ సేవ అందించిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తాయి.
జీతం:
● బేసిక్ పే ₹.14500-₹.28145 ప్రకారం డి ఎ ఇతర అన్ని అలవెన్సులు తో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
● ఈ ఉద్యోగాలకు ఎంపిక లు నాలుగు సామర్థ్య పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
● ఆబ్జెక్టివ్ టైప్ ఆన్ లైన్ పరీక్ష
● లోకల్ లాంగ్వేజ్ పరీక్ష
● ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష
● లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత.
ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష విధానం:
● ఈ పరీక్షను 40 మార్కులకు నిర్వహిస్తారు.
● జనరల్ నాలెడ్జ్/ సింపుల్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు.
● బేసిక్ అండ్ బ్యాంకింగ్ నుండి 20 ప్రశ్నలు.
● నాలెడ్జ్ సెక్యూరిటీ అస్పెక్ట్స్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
● పరీక్ష సమయం 90 నిమిషాలు.
● నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
● ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
◆ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి; తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం:
● దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2022.
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.03.2022.
● అధికారిక వెబ్సైట్: https://www.indianbank.in/
● అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
● ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/ibrsgsscdec21/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment