జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు | DCCB Permanent Positions Recruitment 2023 | Check Vacancies Apply Online here..
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ విజయనగరం, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 15.04.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత, స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు..
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 52.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ విభాగంలో - 32,
- అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో - 20.. పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత :
- 01.01.2023 నాటికి, పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ తర్వాత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
దరఖాస్తు చేశారా?. RTC నుండి కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 10th, Inter లు మిస్ అవ్వకండి..
వయోపరిమితి :
- 01.01.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక ఆన్లైన్ రాత పరీక్షలు/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటాయి.
- రాత పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి (0.25) మార్కులు కోత విధిస్తారు.
- ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ఇంగ్లీష్ లాంగ్వేజ్- 30, రీజనింగ్- 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 35.. మొత్తం - 100.
- పరీక్షా సమయం ఒక(1) గంట.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో 100 శాశ్వత జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | స్వంత జిల్లాల్లో పోస్టింగ్.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.26080 నుండి రూ.57,860 ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్సులతో కలిపి రూ.42,313 ప్రారంభ గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు దరఖాస్తు ఫీజు :
- జనరల్/ బీసీ అభ్యర్థులకు రూ.590/-,
- ఎస్సీ/ ఎస్టీ/ పిసి/ ఈఎక్స్సి అభ్యర్థులకు రూ.413/-.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.04.2023.
రాత పరీక్ష తేదీ :: మే/ జూన్ 2023.
అధికారిక వెబ్సైట్వెబ్సైట్ :: https://www.dccbvizianagaram.com/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆసక్తి కలిగిన యువత ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment