శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | NPCIL ET Recruitment for 325 Permanent Positions Apply here..
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా శిక్షణ అనంతరం శాశ్వత స్థానాల భక్తికి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు.. ముంబై కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో కరెంట్, బ్యాక్ లాక్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, తేదీల వివరాలతో ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య :: 325.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మెకానికల్ - 123,
- కెమికల్ - 50,
- ఎలక్ట్రికల్ - 57,
- ఎలక్ట్రానిక్స్ - 25,
- ఇన్స్ట్రుమెంటేషన్ - 25,
- సివిల్ - 45..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బిఎస్సి (ఇంజనీరింగ్) ఎంటెక్ అర్హతలను కనీసం 60 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక GATE-2021/22/23 స్కోర్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 28.04.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయోపరిమితిలో సడలింపు లు కోరే అభ్యర్ధులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అక్కడ మీ టెక్నికల్ విద్య హాల్లో కనపరిచిన ప్రతిభ, GATE -2021/22/23 ప్రామాణిక స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది.
- శిక్షణా కాలంలో రూ.55,000 జీతంగా చెల్లిస్తారు.
- తదుపరి శాశ్వత స్థానాల్లో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థల్లో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్) ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.04.2023 ఉదయం 10:00 గంటలనుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.04.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
దరఖాస్తు చేశారా? 7,500 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేయండిలా..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment