అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాలు 2023-24 దరఖాస్తులు ఆహ్వానం Heal health and education for all Admissions for Advanced Computer Course 2023-24. Apply here..
అడ్వాన్సులు కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం:
ఇంటర్ ఎంపీసీ లేదా ఎంఈసి అర్హతతో ఏలూరు జిల్లా హరిగిరి పల్లి మండలం తోటపల్లి గ్రామంలోని హీల్ ప్యారడైజ్ క్యాంపస్ 'అలేఖ్య హిల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' 2023-24 విద్యా సంవత్సరానికి అడ్వాన్స్ కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులను రాత (కంప్యూటర్) పరీక్షలకు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
అర్హత ప్రమాణాలు:- ఈ దిగువ పేర్కొన్న అర్హతలతో అనాధ పిల్లలు, తల్లి లేదా తండ్రి లేని పిల్లలు అర్హులు.
విద్యార్హత:
- ఈ కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు తప్పనిసరిగా.. ఇంటర్మీడియట్ లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ(MPC)/ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్(MEC)/ ఇతర సబ్జెక్టులను చదివి ఉండాలి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది.
- ప్రవేశ పరీక్ష రెండు రౌండ్లలో ఉంటుంది.
- మొదటి రౌండ్లో కంప్యూటర్ పరీక్ష నిర్వహిస్తారు.
- ఇందులో ఎంపికైన వారికి కమ్యూనికేషన్ స్కిల్ ముఖాముఖి ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
కోర్స్ ప్రయోజనాలు:
- ఎంపికైన వారు ఉచిత సదుపాయాలతో కోర్స్ పూర్తి చేయవచ్చు.
- ఇక్కడ ప్రవేశం పొందితే కంప్యూటర్ లో శిక్షణ పొందుతూ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విజయవంతంగా నేర్చుకుంటారు.
- ఏదైనా ప్రభుత్వ/ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు 12 నుండి 18 నెలల పాటు శిక్షణ అందిస్తారూ.
మొదటి రౌండ్ పరీక్ష వేదిక, తేదీ, సమయం:
- విజయవాడ తోటపల్లి గ్రామంలోని, హిల్ ప్యారడైజ్ క్యాంపస్ లో, ఆగస్ట్ 26 ఉదయం 11 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://healcharity.org/
సందేహాల నివృత్తి కోసం 9100024435,9100024438 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment