ప్రభుత్వ జాబ్ 💥 అలర్ట్: మైన్ సర్వేయర్, ఓవర్ మెన్ రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు. THDC Opening Regular Vacancies Apply Online here..
భారత ప్రభుత్వానికి చెందిన టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 8 జూనియర్ మైన్ సర్వేయర్, జూనియర్ ఓవర్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Advt.No-03/2025, తేదీ: 12.02.2025 న జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 12.02.2025 నుండి 14.03.2025 మధ్య దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు అయిన విద్యార్హత, ఖాళీల వివరాలు, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి పూర్తి వివరాలు ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 08.
విభాగాల వారీగా ఖాళీలు వివరాలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 12.02.2025 నాటికి 36 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాలు అభ్యర్థులకు వయో-పరిమితిలో 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా నాలుగు ముఖ్య నగరాల్లో మాత్రమే కేటాయించారు. అవి;
- ఢిల్లీ, నోయిడా, డెహ్రాడూన్, లక్నో మరియు చండీఘర్.
అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం ఈ దిగువ పేర్కొన్న విధంగా మార్కులు సాధించాలి..
- Unreserved/ EWS/ OBC(NCL)- 50%,
- SC/ ST/ PwBD/ Ex-Servicemen లు 40%.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ప్రతి నెల రూ.29,400/- నుండి రూ.1,19,200/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-
- ఎస్సీ/ ఎస్టి/ పీడబ్యూబీడీ/ ఎక్స్-సర్వీస్ మెన్ / జమ్ము & కాశ్మీర్ స్థానికులకు/ కంపెనీ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.02.2025 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 14.03.2025 సాయంత్రం 06:00 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.thdc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment