Telangana medical officer recruitment 2021 | Download application here..
రంగారెడ్డి జిల్లా మెడికల్ ఆఫీసర్ నియమకాలు 2021.. అకడమిక్ మార్కుల ఆదారంగా ఎంపిక... పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
📢 పల్లె దవాఖానాల్లో 1677 ఖాళీల భర్తీకి జిల్లావా వారీగా నోటిఫికేషన్ లు విడుదల.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలకోసం ఈ పేజ్ ను పూర్తిగా చదవండి..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (District Medical and Health Officer) నుండి ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రంగారెడ్డి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 93 మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ 12.10.2021.
మిగిలిన జిల్లాల ఖాళీల వివరాలు UpdatedSoon..
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ పలు పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 93 మెడికల్ ఆఫీసర్ పల్లె దావఖాన ఖాళీల భర్తీకి నియామకాలు 2021. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగానే ఈ ఎంపికలు నిర్వహిస్తారు.
అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://rangareddy.telangana.gov.in/ సందర్శించండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 93,
విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఎంబిబిఎస్ పట్టా పొంది ఉండాలి. అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
💦దరఖాస్తులన ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
💦అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను https://rangareddy.telangana.gov.in/ సందర్శించండి.
💦అధికారిక నోటిఫికేషన్ చివరలో అప్లికేషన్ ఫామ్ ను పొందుపరిచారు అక్కడి నుండి ప్రింట్ తీసుకొని, సంబంధిత వివరాలను నమోదు చేసి, అవసరమైన ధ్రువపత్రాల నకలు కాపీలను జోడించి, నేరుగా దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి.
💦ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.10.2021,
💦దరఖాస్తు పరిశీలనలు: 13.10.2021 నుండి 20.10.2021 వరకు.
💦మెరిట్ లిస్ట్ ప్రకటన (అభ్యంతరాలకు అవకాశం): 21.10.2021 నుండి 25.10.2021 వరకు.
💦తుది మెరిట్ లిస్ట్ విడుదల: 26.10.2021.
💦కౌన్సిలింగ్ తేదీ: 27.10.2021.
ఎంపిక విధానం: పల్లె దావఖాన మెడికల్ ఆఫీసర్ నియామకాలకు ఎటువంటి పరీక్ష లేదు, కేవలం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అధికారిక వెబ్సైట్: https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment