Power Grid Recruitment 2022 | పవర్ గ్రిడ్ ఫీల్డ్ ఇంజనీర్ & ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..
పవర్ గ్రిడ్ ఉద్యోగ నియామకాలు - 2022 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన, ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 1, 2022 వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
భారత ప్రభుత్వానికి చెందిన, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ప్రధాన కార్యాలయం భారతదేశంలోని గురుగ్రామ్ లో ఉంది. భారతదేశం అంతటా విద్యుత్ ను ప్రసారం చేయడానికి పవర్ గ్రిడ్ కీలక పాత్ర పోషిస్తుంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 75,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 25,
◆ ఫీల్డ్ ఇంజనీర్(సివిల్) - 10,
◆ ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్) - 30,
◆ ఫీల్డ్ సూపర్వైజర్(సివిల్) - 10..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లమా అర్హతతో, 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయసు: జూన్ 1 2022 నాటికి 29 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో సూచించారు. టెక్నికల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ ఛాయిస్ రూపంలో హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు:
◆ ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్/ సివిల్) - ₹.400/-
◆ ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్/ సివిల్) - ₹.300/-.
Wipro Elite NTH Recruitment 2022 | 3.5 Lacks Salary P.A | Check Eligibility and Online Apply here..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.05.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 01.06.2022.
అధికారిక వెబ్సైట్: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment