5000 ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ | Central Bank of India Bumper Recruitment 2023 | Apply here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 20.03.2023 నుండి దరఖాస్తులను ప్రారంభించింది ఆసక్తి కలిగిన వారు 03.04.2023 వరకు లేదా అంత కంటే ముందుగా దరఖాస్తులు చేయవచ్చు, ఖాళీల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఏప్రిల్ రెండో వారంలో ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ముందస్తు సమాచారం జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ.. పూర్తి వివరాలను ఇక్కడే తెలుగులో తెలుసుకోవచ్చు.. అదే విధంగా దరఖాస్తు చేయడానికి సంబంధించిన లింక్ దిగువన ఇవ్వడం జరిగింది తనిఖీ చేయండి.
తప్పక చదవండి :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు వివరాలివే..
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5000 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
- భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఆన్లైన్ అర్హత పరీక్ష ద్వారా సీటు పొందవచ్చు..
- గ్రాడ్యుయేషన్ అర్హత + ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
- ఈ శిక్షణ ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
- శిక్షణా కాలంలో రూ.10,000 - రూ.15,000 వేల వరకు ప్రతినెల స్టైస్పెండ్ రూపంలో అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.
- దేశవ్యాప్తంగా మొత్తం 34 (రాష్ట్ర) కేంద్ర పాలిత ప్రాంతాల్లో) ఈ ఖాళీలు ఉన్నాయి.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు..
- ఆంధ్రప్రదేశ్ లో- 141 ; విజయవాడ గుంటూరు విశాఖపట్టణం రీజియన్ లలో..
- అలాగే తెలంగాణ లో - 106 ; హైదరాబాద్ వరంగల్ రీజియన్ లో అందుబాటులో ఉన్నాయి.
తప్పక చదవండి :: కేంద్రీయ విద్యాలయ CRPF, బార్కాస్, హైదరాబాద్ -5 టీచింగ్ పోస్టులకు ఈ నెల 14, 25 న ఇంటర్వ్యూలు..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి:
- 31.03.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పరిమితిలో (5 - 35 సంవత్సరాల వరకు) సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ దిగువన పిన్ చేశాను చూడండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది.
- క్వాంటిటేటివ్ జనరల్ ఇంగ్లీష్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్,
- బేసిక్ రిటైల్ లిటిల్ ఈ ప్రోడక్ట్స్,
- బేసిక్ రీటైల్ అసెట్ ప్రోడక్ట్స్,
- బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్,
- బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్.. నుండి ప్రశ్నలు అడుగుతారు.
తప్పక చదవండి :: 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | దరఖాస్తు చేయరా?.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- PwBD అభ్యర్థులకు రూ.450/- +GST,
- SC, ST/ All Women అభ్యర్థులకు రూ.600/- +GST,
- మిగిలిన వర్గాల వారికి అభ్యర్థులకు రూ.800/- +GST,
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.04.2023 వరకు.
తాత్కాలిక ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: ఏప్రిల్ 2వ వారం.
అధికారిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ :: https://www.centralbankofindia.co.in/
అధికారిక అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment