ఉపాధ్యాయుల నియామకాలకు దరఖాస్తులు షురూ.. TS DSC 2023 for 5089 Posts Onlin Apply Started..
ఉపాధ్యాయుల నియామక ప్రకటన 2023:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ తెలంగాణ హైదరాబాద్. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మొదలగు విభాగాల్లోని 5089 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఉపాధ్యాయ శిక్షణ అర్హతలు (డి.ఎడ్/ బీ.ఎడ్/ బీ.పీ.ఎడ్) కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 20.09.2023 నుండి 21.10.2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. పూర్తి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోపానాలు దిగువ సూచించడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు పూర్తిగా చదవండి. దరఖాస్తులు సమర్పించండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 5089.
విభగలవారీగా ఖాళీల వివరాలు :
- సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) - 2575,
- స్కూల్ అసిస్టెంట్ (SA) - 1739,
- లాంగ్వేజ్ పండిట్ (LP) - 611,
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) - 164.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీ.ఎడ్, బీ.ఎడ్, బీ.పీ.ఎడ్ తో టెట్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని గరిష్టంగా 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి కలిగిన అభ్యర్థులకు రిజర్వేషన్ ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
- TS DSC 2023 TRT New Syllabus :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- ఆన్లైన్ రాత పరీక్షలు నవంబర్ 20 నుండి 30 వరకు నిర్వహించనున్నారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి;
1. మహబూబ్నగర్, 2. రంగారెడ్డి, 3. హైదరాబాద్, 4. మెదక్, 5. నిజామాబాద్, 6. అదిలాబాద్, 7. కరీంనగర్, 8. వరంగల్, 9. ఖమ్మం, 10. నల్లగొండ, 11. సంగారెడ్డి మొదలగునవి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.1000/-.
- ప్రతి పోస్ట్ కు సపరేట్ గా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://schooledu.telangana.gov.in/
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు : Pdf డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.09.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.10.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment