తెలంగాణ ఏకలవ్య ఆదర్శ పాఠశాల ప్రవేశాలు 2023-24 | 6వ, 7వ, 8వ & 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేయండిలా. EMRS 2023-24 Admission Application Process for 6th, 7th, 8th & 9th Apply Online here..
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలోని (23) ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశానికి గాను 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతుంది. అలాగే 6వ, 7వ, 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి 7వ, 8వ, 9వ తరగతులలో గల మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన 2022 -23 విద్యాసంవత్సరంలో 5వ,6వ, 7వ, 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో 27-03-2023 నుండి 20-04-2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.
1st - PG Admissions 2023-24!
ఖాళీల వివరాలు:
- ఖాళీగా ఉన్నటువంటి సీట్ల సంఖ్య :- 1380.
అన్ని జిల్లాలో ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల భక్తికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
విద్యార్హత :
- 2022-2023 విద్యాసంవత్సరంలో 5వ, 6వ, 7వ & 8వ తరగతి తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
- 6వ, 7వ, 8వ, 9వ తరగతి లో ప్రవేశం కోరుకునే బాల, బాలికలు 2022-2023 విద్యా సంవత్సరంలో ముందు తరగతుల్లో చదువుతూ లేదా పాసై ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 5వ తరగతి (6వ, 7వ, 8వ) మార్కుల మేము, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైన్స్ ఫోటోలతో సిద్ధంగా ఉండాలి.
- విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
2023-24 విద్యాసంవత్సరంలో 7, 8, 9 లో ఖాళీగా ఉన్నటువంటి 233 సీట్లను ST విద్యార్థులచే పూర్తి చేయబడును.
వయసు :
- 01-04-2023 నాటికి విద్యార్థుల వయసు తరగతి వారిగా దిగువన ఉన్న విధంగా ఉండాలి.
- 6వ తరగతి -10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- 7వ తరగతి -12 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఉండాలి.
- 8వ తరగతి -13 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల లోపు ఉండాలి.
- 9వ తరగతి -14 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 20-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : http://emrs-23adm.iyuga.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులో భాగంగా ఆన్లైన్ ఫీజు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment