SBI Junior Associates JOBs in Telangana || ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలివే...
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ అసోసియేట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్స్
పోస్టు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
హైదరాబాద్(తెలంగాణ)లో ఉన్న ఖాళీలు: 275
విద్యార్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది...
వయసు: 2021 ఏప్రిల్ 1 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్య ర్డులు పదేళ్లు గరిష్ట వయోపరి మితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష), మరియు (స్థానిక భాష) లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ను నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ టెస్టు 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 60నిమిషాలు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 1/4 మార్కు కట్ చేస్తారు.
• ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి
30 ప్రశ్నాలు 30 మార్కులు 20 నిమిషాలు
• న్యూమరికల్ ఎబిలిటీ నుండి
35 ప్రశ్నాలు 35 మార్కులు 20 నిమిషాలు
• రీజనింగ్ ఎబిలిటీ నుండి
35 ప్రశ్నాలు 35 మార్కులు 20 నిమిషాలు
ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్
పరీక్షకు ఎంపిక చేస్తారు.
మెయిన్స్ పరీక్షను 200 మార్కు లకు
నిర్వహిస్తారు. దీనిలో 4 సెన్షన్లు ఉంటాయి. మొత్తం 190 ప్రశ్నలు
ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.
• జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి
50 ప్రశ్నలు 50 ప్రశ్నల 35 నిమిషాలు
• జనరల్ ఇంగ్లీష్ నుండి
40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాలు
• క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి
50 ప్రశ్నలు 50 మార్కులు 45 నిమిషాలు
• రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి
50 ప్రశ్నలు50 మార్కులు 45 నిమిషాలు
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.05.02021
ప్రిలిమినరీ పరీక్ష: 2021 జూన్ లో
మెయిన్స్ పరీక్ష : 2021 జూలై 31
అదికారిక వెబ్ సైట్: https://www.sbi.co.in
అదికారిక నోటిఫికేషన్:








































Comments
Post a Comment