TTWREIS, TSWREIS Teaching Faculty Recruitment 2021 || తెలంగాణ గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులల్లో టీచర్ ఉద్యోగాలు.. పూర్తివివరాలివే...
తెలంగాణ ప్రభుత్వం
గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల అశోక్ నగర్ వరంగల్ మరియు సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల రుక్మావూర్ కరీంనగర్ లలో అవుట్ స్టాండింగ్ ప్రాతిపదికన సీబీఎస్ఈ సిలబస్ ను 6 నుండు 12 తరగతులకు బోధించడానికి టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
సైనిక పాఠశాలలో బోధన సిబ్బంది నియామకాలకు మొత్తం 46 పోస్టులను ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
■ టీజీటీ విభాగం లో..
1. తెలుగు లో - 2,
2. ఇంగ్లీష్ లో - 4,
3. మ్యాథమెటిక్స్ లో - 6,
4. ఫిజికల్ సైన్స్ లో - 4,
5. బయాలజికల్ సైన్స్ లో - 2,
6. సోషల్ స్టడీస్ లో - 6,
7. హిందీ లో - 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: టీజీటీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) అర్హత కలిగి ఉండాలి.
సీటెట్ లేదా టెట్ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
8. ఆర్ట్ లో - 2 పోస్టులు..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఐదు సంవత్సరాల డిప్లామా లేదా రెండు సంవత్సరాల ఫుల్ టైం డిప్లామా లేదా డ్రాయింగ్ లో ఎం.ఏ డిగ్రీ/ పెయింటింగ్/ శిల్పం/ గ్రాఫిక్ ఆర్ట్ మొదలైన అర్హత సర్టిఫికెట్లను కలిగి ఉండాలి.
9. కంప్యూటర్ లో - 2 పోస్టులు..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్(ఎమ్సీఏ)/ బీటెక్ కంప్యూటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
10. కౌన్సిలర్ లో - 2 పోస్టులు..
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్ఏ లో సైకాలజీ లేదా కౌన్సిలింగ్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో డిప్లామా అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
■ జూనియర్ లెక్చరర్/ పీజీటీ విభాగం లో..
11. ఇంగ్లీష్ లో - 2,
12. మేథ్స్ లో - 6,
13. ఫిజిక్ లో - 1,
14. కెమిస్ట్రీ లో - 1,
15. తెలుగు లో - 1,
16. జనరల్ సైన్స్ లో - 2 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: జూనియర్ లెక్చరర్/ పీజీటీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) అర్హత సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.
సీటెట్ లేదా టెట్ అర్హత కలిగి ఉండాలి.
జీతాల వివరాలు:
1. టీజీటీ లకు రూ.30,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
2. జూనియర్ లెక్చరర్/పీజీటీ లకు
రూ.40,000/- ఆప్షనల్ సబ్జెక్ట్ లకు
రూ.30.000/- లాంగ్వేజెస్ లకు ప్రతి నెలా చెల్లిస్తారు.
3. ఆర్ట్ టీచర్ల కు రూ.20,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
4. కంప్యూటర్ టీచర్ల కు రూ.20,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
5. కౌన్సిలర్ లకు రూ.20,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
లెవెల్ 1: 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.
75 మార్కులు సబ్జెక్ట్ నాలెడ్జ్ నుండి.
15 మార్కులు మెథడాలజీ నుండి.
10 మార్కులు టీచింగ్ ఆప్టిట్యూడ్ నుండి మొత్తం 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది.
ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
లెవెల్ 2: ఈ పరీక్ష మొత్తం 50 మార్కులకు ఉంటుంది.
25 మార్కులకు డెమో.
25 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, 500 రూపాయల దరఖాస్తు ఫీజును ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తులు చేసుకోండి.
ప్రకటన విడుదలైన తేదీ: 17.04.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.05.2021.
రాత పరీక్ష నిర్వహించు తేదీ: 24.05.2021.
ఇంటర్వ్యూ మరియు డెమో లు నిర్వహించు తేదీ: 09.06.2021.
ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రకటించు తేదీ: 16.06.2021.
అధికారిక వెబ్ సైట్: https://tgtwgurukulam.telangana.gov.in/ ,https://tswreis.in/
ఆన్లైన్ దరఖాస్తులకు: ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక నోటిఫికేషన్:👇
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.








































Comments
Post a Comment