SKLTHSU Recruitment 2021 || శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వివిద ఉద్యోగాల. పూర్తి వివరాలివే...
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట లో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
విభాగాల వారీగా ఖాళీల వివరాలు
● క్యాటగిరి -౹
1. ఫామ్ మేనేజర్,
2. ల్యాబ్ టెక్నీషియన్.
● క్యాటగిరి -౹౹
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-౹౹౹
● క్యాటగిరి -౹౹౹
1. డ్రైవర్
2. అటెండర్ మొదలగు పోస్టులను ప్రకటించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.06.2021.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, పే స్కేల్ మొదలగునవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
● క్యాటగిరి -౹
1. ఫామ్ మేనేజర్ - 1పోస్ట్.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్/ అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.34,800/-
2. ల్యాబ్ టెక్నీషియన్ - 1పోస్ట్.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్/ అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.34,800/-
తప్పక చదవండి: RCFL Operator Grade1 Recruitment 2021 || రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగాల.. వివరాలివే... ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.06.2021.NEW
● క్యాటగిరి -౹౹
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 1పోస్ట్.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో స్టాండర్డ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ (లేదా) ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
జీతం: రూ.20,200/-.
● క్యాటగిరి -౹౹౹
1. డ్రైవర్ - 2 పోస్టులు.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత తో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో డ్రైవింగ్ అనుభవం లేదా మోటార్ మెకానిక్ పని అనుభవం అవసరం.
జీతం: రూ.20,200/-.
2. అటెండర్ - 2 పోస్టులు.
విద్యార్హత: 7వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత, 10వ తరగతి విఫలమైన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణిస్తారు. దానికంటే ఎక్కువ అర్హత గల విద్యార్థులు ఈ పోస్టులకు అనర్హులుగా పరిగణించబడతారు.
జీతం: రూ.20,200/-.
తప్పక చదవండి➧ IBPS RRBs CRP RRBs X Recruitment2021 || ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే... చివరి తేదీ: 28.06.2021 NEW
వయసు: 01-07-2021 నాటికి స్త్రీ, పురుష అభ్యర్థుల వయస్సు 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు ఫీజు: రూ.700/-, రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులకు రూ.600/-.
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేరువేరుగా వారి దరఖాస్తులను సమర్పించాలని, సూచించారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, అనుభవం మరియు రాత పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
రాతపరీక్ష ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది.
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ బహుళైచిక ప్రశ్న రూపంలో ఉంటుంది.
ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
తప్పక చదవండి➧ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 7236 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే... చివరి తేదీ: 24.06.2021 NEW
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: http://skltshu.ac.in/
2. హోం పేజీ ని కొద్దిగా స్క్రోల్ అప్ చేయండి, క్రింద కనిపిస్తున్న అటువంటి అనౌన్స్మెంట్ లోని ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
3. దరఖాస్తు సమర్థించడానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అయినది, దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను చదవండి.
4. దరఖాస్తు ప్రక్రియ మొత్తం 4 స్టెప్స్ లు గా ఉంటుంది.
1. ఫస్ట్ స్టెప్: అప్లికేషన్ ఫ్రీ పేమెంట్,
2. సెకండ్ స్టెప్: నో యువర్ పేమెంట్ స్టేటస్,
3. థర్డ్ స్టెప్: ఫీల్ అప్లికేషన్ ఫామ్,
4. ఫోర్త్ స్టెప్: ప్రింట్ అప్లికేషన్ ఫామ్.
ఇది కూడా చదవండి➧ TTWREIS inter Admissions 2021-22 || ఇంటర్ లో ప్రవేశం కోసం విధ్యార్థులు వారి ఎస్ఎస్సి సిజిపిఏ గ్రేడ్లను మొబైల్ ఫోన్ సహాయం తో నమోదు చేసుకునే విధానం.. చివరి తేదీ: 15.06.2021 NEW Argent
ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ చెల్లించి, దరఖాస్తులను సమర్పించండి
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.06.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: http://skltshu.ac.in/
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://skltshu-recruitment.aptonline.in/SKLTSHU/HomePage.aspx
అధికారిక నోటిఫికేషన్:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం వీడియొ చూడండి👇
Comments
Post a Comment