TS Best Available School Admissions 2022-23 | షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, భద్రాద్రి కొత్తగూడెం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు ప్రవేశాలకు ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వంప్రభుత్వం, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. 2022 23 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి నాన్ రెసిడెన్షియల్ (డే స్కాలర్) 1వ ఒకటవ తరగతి ప్రవేశం కొరకు, షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థుల నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52 సీట్లు షెడ్యూలు కులాల విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు ఫారం లను కొత్తగూడెం, పాల్వంచ, మరియు భద్రాచలం సహాయ షెడ్యూల్ కులాల శాఖ అధికారి కార్యాలయం నుండి పొంది, వాటిని పూర్తి చేసి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 03.06.2022 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలెను..
అర్హతలు:
◆ కుటుంబంలోని ఒక విద్యార్థిని, విద్యార్థులకు మాత్రమే ఈ పథకం క్రింద ప్రవేశం కల్పిస్తారు.
◆ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 1,50,000/- రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి 2,00,000/- రూపాయలకు మించకుండా ఉండాలి.
◆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన విద్యార్థిని, విద్యార్థులు మాత్రమే అర్హులు.
◆ విద్యార్థిని, విద్యార్థులు యొక్క వయస్సు 5 - 6 సంవత్సరములకు మించకూడదు.
దరఖాస్తుతో పాటు జత చేయవలసిన పత్రములు వివరాలు:
◆ పుట్టినతేది ధృవీకరణ పత్రము,
◆ రేషన్ కార్డ్,
◆ ఆధార్ కార్డ్,
◆ కుల దృవీకరణ పత్రము,
◆ ఆదాయ ధ్రువీకరణ పత్రం,
◆ 1వ తరగతి ప్రవేశం కొరకు UKG చదివిన స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్, ఐదవ తరగతి ప్రవేశం కొరకు న4వ తరగతి చదివిన స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్ జత చేయవలెను.
◆ రెండు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు.
ఎంపిక విధానం:
◆ వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, 08.06.2022 న జిల్లా సెలక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ పద్ధతిన ఎంపికలు నిర్వహిస్తారు.
◆ దరఖాస్తులు సమర్పించినవారు హాజరుకావాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 03.06.2022.
అధికారిక నోటిఫికేషన్:
సూచన :: ఈ నీటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment