SBI SO Recruitment 2021|| ఎస్బిఐ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ జూన్ 28..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైర్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి, ఎస్బిఐ, ఓఎస్ రిక్రూట్మెంట్ - 2021 ను మరలా ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియ 15 జూన్, 2021 మొదలు జూన్ 28, 2021 తో ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ www.sbi.co.in ను సందర్శించి తెలుసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 16 ప్రకటించారు.
16 ఫైర్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి, ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. నియామక పద్ధతి, అర్హత ప్రమాణాలను కూడా తాజాగా సవరించడం జరిగింది.
ఎస్బిఐ ఫైర్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి సవరించిన విద్యార్హత:
●నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్(ఎన్ఎఫ్ఎస్సి) నుండి బీఈ (ఫైర్) ఉత్తీర్ణత.
●యూజీసీ/ ఏఐసిటిఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి బీటెక్(సేఫ్టీ అండ్ ఫైర్) ఇంజనీరింగ్/ బీటెక్(ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్)/ బిఎస్సి (ఫైవ్) ఉత్తీర్ణులై ఉండాలి.
● (ఇండియా/ యూకె) ఇన్స్టిట్యూట్ లనుండి ఫైర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.
● నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్, (ఎన్ఎఫ్ఎస్సి) నాగపూర్ నుండి డివిజనల్ ఆఫీసర్ కోర్సు ఉత్తీర్ణత.
Must read: Schedule of Telangana Common Entrance TESTs-2021 Dates out. Get details Here..
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూలో 100 మార్కులు ఉంటాయి.
మెరిట్ జాబితా: ఇంటర్వ్యూ లో పొందిన స్కోర్ ఆధారంగా ఎంపిక మెరిట్ జాబితా చేయబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.06.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.06.2021.
తప్పక చదవండి: NCPOR Recruitment 2021 || నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ లో వివిధ ఉద్యోగాలు..
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-.
ఎస్సీ/ ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎస్బిఐ ఎస్ఓ పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
2020 డిసెంబర్ 22 నుండి 27 వరకు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయవలసిన అవసరం లేదు, వారి దరఖాస్తులు పరిగణించబడతాయి..
అధికారిక వెబ్సైట్: https://www.sbi.co.in/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment