UPSC NDA & NA Exam 2022 | ఇంటర్ తో 400 కేంద్ర ప్రభుత్వ కొలువులు | సెకండియర్ చదువుతున్నవారు కూడా అర్హులే..
UPSC NDA & NA 2 Examination 2022: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నెవల్ అకాడమీ (NA) అవివాహిత మహిళ పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుండి.. జూన్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలైన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, దరఖాస్తును ఫీజు, ఎంపిక విధానం, రాతపరీక్ష సెంటర్ల వివరాలు, పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 400
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) - 370,
● ఆర్మీ - 208,
● నేవీ - 42,
● ఎయిర్ పోర్ట్ - 120..
◆ నేవెల్ అకాడమీ (10+2 క్యాడేట్ ఎంట్రీ స్కీం) - 30..
UPSC NDA & NA 2 Examination 2022 అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
● ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్(10+2) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
● ఎయిర్ పోర్ట్, నేవల్ వింగ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తో ఉత్తీర్ణులైన మరియు రెండవ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
జనవరి 02, 2004 నుండి జనవరి 01, 2007 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఆధారంగా నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాల వివరాలు:
◆ దేశ వ్యాప్తంగా ముఖ్య రాష్ట్రాల్లోని ప్రధాన జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
◆ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం అనంతపూర్ పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.100/-,
ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.06.2022.
అధికారిక వెబ్సైట్: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment