JOB Updates: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, సెలక్షన్ విధానం ఇదే. అప్లై చేయండి. New Vacancies
డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్లు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, అధికారికంగా ప్రకటించింది. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఇలా ఉండనుంది. అక్కడ మీకు ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న ప్రభుత్వం జీఓ-4 జారీ చేసింది. ఇటీవల టీజీపీఎస్సీలో జరిగిన సమావేశంలో డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా డిగ్రీ అధ్యాపకుల పోస్టుల్ని ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భర్తీ చేశారు. ఆ తదుపరి డిసెంబర్ 2022లో 544 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. యు జి స మార్గదర్శకాలను పాటించలేదన్న కారణంగా నియామక ప్రక్రియ ఆగిపోయింది నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఆ వివరాలకు సంబంధించి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఈ పోస్టులతో పాటు మరో 1000 పోస్టులు ప్రకటించాలని ప్రతిపాదనలు చేసిన ఆర్థిక శాఖ, 544 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. ఈ ప్రకారం డిగ్రీ కళాశాల అ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం 132 డిగ్రీ కళాశాలలో ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 150 కి పెరిగినట్లు తాజా గణాంకాలలో తేలింది. అధ్యాపకులు, లైబ్రరీయన్లు, పీడీలు కలిపి మొత్తం 4098 సాంక్షన్ పోస్టులు ఉండగా, ఇప్పటికే 1500 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 2000 మంది అతిధి అధ్యాపకులు, 400 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే టీజీపీఎస్సీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 544 పోస్టులు భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. మరో 1000 పోస్టులు కూడా ప్రకటించాలని కోరడంతో వాటి ఆమోదం తెలిపితే, మరో నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
డిగ్రీ కళాశాలలో పోస్టుల కోసం ఇప్పటికే ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థులు, అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత, నియామక ప్రమాణాలు తెలుసుకొని, ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడండి. తాజా ఉద్యోగం అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













Comments
Post a Comment