TTWREIS and TSWREIS part time Subject Associates Recruitment 2021 || గిరిజన సంక్షేమ గురుకులాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
హైదరాబాదులోని తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీ కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలలో 2021-22 విద్యాసంవత్సరానికి జేఈఈ, నీట్, ఎంసెట్ ట్రైనింగ్ కోసం పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి ఉన్నా అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 110 ప్రకటించారు.
తెలంగాణ (గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ) రెండు గురుకుల సొసైటీలలో కలిపి సబ్జెక్ట్ల వారీగా ఖాళీల వివరాలు.
1. మ్యాథమెటిక్స్ - 16,
2. ఫిజిక్స్ - 20,
3. కెమిస్ట్రీ - 24,
4. బోటనీ - 23,
5. జువాలజీ - 24,
6. సివిక్స్ - 2,
7. ఎకనామిక్స్ - 1..
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, బ్యాచిలర్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి.
★ బాలికల కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో పని చేయడానికి మహిళా అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం:
1. సంబంధిత సబ్జెక్టులో ప్రోఫిసిఎన్సీ టెస్ట్,
2. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్,
3. జేఈఈ/ నీట్/ ఎంసెట్ పరీక్షా విధానంపై పరిజ్ఞానం మొదలగు విషయాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్ష విధానం:
ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
1. స్క్రీనింగ్ టెస్ట్ కు 50 మార్కులు,
2. డెమో కు 25 మార్కులు,
3. ఇంటర్వ్యూ కు 25 మార్కులు..
4. మాస్టర్ డిగ్రీలో చదివిన ముఖ్య సబ్జెక్టు నుండి స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
5. పరీక్ష సమయం: 60 నిమిషాలు.
6. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు,
7. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
జీతం: ప్రతి నెల రూ.25,000/- చెల్లిస్తారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tgtwgurukulam.telangana.gov.in/ & https://tswreis.in/
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.07.2021
రాతపరీక్ష నిర్వహించు తేదీ: 10.07.2021,
డెమో/ ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: 18.07.2021,
పోస్ట్ కేటాయింపు తేదీ: 31.07.2021.
పరీక్ష ఫీజు: రూ.500/-
అధికారిక నోటిఫికేషన్:
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి లింక్: http://kishoremamilla-001-site5.itempurl.com/start.html
Comments
Post a Comment