Telangana SSC Examination MAY-2022 HallTickets Released | Download process here @ elearningbadi.in/
తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ నుండి జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు వెబ్ సైట్ ను సందర్శించి వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు..
ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు జరుగుతాయి. TS SCERT, BSE Telangana 70% సిలబస్ ఆధారంగా, 30% సిలబస్ తగ్గించారు, పేపర్ లను తగ్గించి ఈ పరీక్షలను నిర్వహించనుంది.
హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.bse.telangana.gov.in/
◆ Hall Tickets for SSC MAY-2022 లింక్ పై క్లిక్ చేయండి.
◆ హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆ జిల్లా, పాఠశాల, మీ పేరు ను ఎంపిక చేసుకొని, పుట్టిన తేదీని నమోదుచేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ షో అవుతుంది.
◆ డౌన్లోడ్ చేసుకొని భద్రపరుచుకోండి.
◆ పరీక్ష హాలులో ఈ హాల్టికెట్లు అనుమతించబడతాయి. గమనించండి.
◆ ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసిన హాల్టికెట్ లపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు.
◆ తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందుకోవడానికి మాన వెబ్ పేజీ ను సబ్స్క్రైబ్ చేయండి..
Comments
Post a Comment