Singareni JOBs 2022 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!... | 1300 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే.
నిరుద్యోగులకు శుభవార్త!
SCCL సింగరేణి కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. కొద్ది రోజుల క్రితం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు "ఇంటర్నల్ & ఎక్స్టర్నల్" నోటిఫికేషన్ను విడుదల చేసింది. తాజాగా మరొక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీకోసం.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్ లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, మెకానిస్ట్.. మొదలగు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఐటీఐ అర్హత కలిగినటువంటి అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో అందుబాటులోకి రానుంది.. తాజాగా ప్రకటించిన సర్కులర్ ప్రకారం ఈ వివరాలను మీకు తెలియపరుస్తున్నాను.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి నుండి అధికారిక SCCL సింగరేణి పోర్టల్ వెబ్ సైట్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకుని తదుపరి NAPS నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ ను సందర్శించే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ దరఖాస్తు లకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 25.07.2022 నా ఉదయం 11:00 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులు టెక్నికల్ విద్యార్హతలు సాధించిన మార్కుల ఆధారంగా సీనియారిటీ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఈ ఖాళీలను 95 శాతం లోకల్ తెలంగాణ వారికి కేటాయించారు.
5 శాతం నాన్ లోకల్ వారిచే భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తులను సబ్మిషన్ చెయ్యండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.07.2022 ఉదయం 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.08.2022 సాయంత్రం 05:00 గంటల వరకు
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment