ITBPT JOB 2022 | 10 పాస్ తో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన | మిస్ అవ్వకండి..
10 పాస్ సర్టిఫికెట్ కలిగిన ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం 10/ తత్సమాన అర్హత తో సివిల్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులతో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 16వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష ఆధారంగా ఎంపికాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి... ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాతపరీక్ష, పరీక్ష సెంటర్ల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 37,
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హత తో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
ఆగస్టు 14, 2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు.
◆ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
◆ ఓబీసీలకు 3 సంవత్సరాలు,
◆ మాజీ సైనికులకు సర్వీసు నిబంధనల ప్రకారం 3 నుండి 8 సంవత్సరాలు సడలింపు వర్తిస్తాయి.
Singareni JOBs 2022 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!... | 1300 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, పిఈటి టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు నోటిఫికేషన్ ప్రకారం ఇతర నిర్దిష్ట పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక లు చేపడతారు.
◆ రాత పరీక్ష ఓఎంఆర్(OMR బేస్డ్ / కంప్యూటర్(CBT) బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది.
◆ ఈ రాత పరీక్షలో జనరల్ ఇంగ్లీష్(సివిల్) & ఇన్ స్ట్రక్చర్ నుండి మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
◆ జనరల్ అవేర్నెస్ నుండి 160 ప్రశ్నలు,
◆ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్ రీజనింగ్ మొదలగు వాటి నుండి 40 ప్రశ్నలు,
◆ ఇలా మొత్తం 200 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు.
◆ పరీక్ష సమయం 3 గంటలు.
◆ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
★ నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్-6 ప్రకారం ₹.35,400/- నుండి ₹.112,400/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
UR, OBC, EES అభ్యర్థులకు ₹.200/-.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.07.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.08.2022
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://recruitment.itbpolice.nic.in/
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment