ASRB Recruitment 2021 | Apply various vacancies of Administrative Officer (AO) and Finance & Account Officer (F&AO) Competitive Examination 2021.
డిగ్రీ విద్యార్హతతో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | జీతం: రూ.15,600 - 39,100/- వరకు మరియు 5,400/- (గ్రేడ్ పే) | పోస్టుల వివరాలు | పరీక్ష విధానం | దరఖాస్తు విధానం | మొదలగు వివరాలు వివరంగా ఈ క్రింద ఉన్నాయి చదవండి.
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ఏఎస్ఆర్బి) డిగ్రీ విద్యార్హతతో శాశ్వత ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా, నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 65,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) - 44,
2. ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్&ఏఓ) - 21.
విద్యార్హత:
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) పోస్టులకు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 55 శాతం మార్కులకు తగ్గకుండా గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణతతో, కంప్యూటర్ పై పని చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
2. ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్&ఏఓ) పోస్టులకు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 55 శాతం మార్కులకు తగ్గకుండా గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణతతో, కంప్యూటర్ పై పని చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
మరియు ఫైనాన్స్/ అకౌంటింగ్/ కామర్స్ మొదలగు స్పెషలైజేషన్ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు:
ఆగస్ట్ 23, 2021 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. మరియు అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు, ఆ వివరాలను తెలుసుకోవడానికి ఈ పేజీ క్రింద ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, అధికారిక ప్రకటనను చదవండి.
ఎంపిక విధానం:
టైర్ - 1 పరీక్ష,
టైర్ - 2(డిస్క్రిప్టివ్) పరీక్ష,
టైర్ - 3 ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు.
టైర్ - 1 పరీక్ష ప్రమాణాలు:
● ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ పేపర్ 200 మార్కులకు ఉంటుంది.
● ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు
● పరీక్ష సమయం 3 గంటలు.
■ సెక్షన్ ఎ లో జనరల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు
■ సెక్షన్ బి హలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు.
■ సెక్షన్-3 లో అర్థమెటిక్ అల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు.
■ సెక్షన్ ఫోర్ లో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ (హిందీ/ ఇంగ్లీష) నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
టైర్- 1, పరీక్షలో అర్హత సాధించిన వారికి టైర్- 2, పరీక్షకు అనుమతిస్తారు.
★ ఒక ఖాళీ కోసం 20 టాప్ స్కోరింగ్ అభ్యర్థులను టైర్- 2 పరీక్షకు అనుమతిస్తారు.
టైర్ - 2(డిస్క్రిప్టివ్) పరీక్ష:
● ఈ పరీక్షను మొత్తం నాలుగు పేపర్లకు నిర్వహిస్తారు
● పేపర్- 1: జనరల్ అవేర్నెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ, సోషల్, సైంటిఫిక్ & కల్చరల్ ఫీల్డ్, హిస్టరీ & జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్ మొదలగు విషయాలపై 150 మార్కులకు ఉంటుంది.
● పేపర్- 2: కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటి, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అంశాలపై 150 మార్కులకు ఉంటుంది.
● పేపర్- 3: ఎస్సే రైటింగ్-1, ఎస్సే రైటింగ్-2 లను 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ఎస్సే కు 75 మార్కులు కేటాయిస్తారు.
● పేపర్- 4: ఎథిక్స్, ఇంటెగ్రిటీ, యాటిట్యూడ్
● మొదలగు విషయాలపై 150 మార్కులకు నిర్వహిస్తారు.
● ఇలా ఈ పరీక్ష మొత్తం 600 మార్కులకు ఉంటుంది.
● ప్రతి పేపర్ పరీక్ష సమయం 3 గంటలు.
★ టైర్- 2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులను టైర్- 3 పరీక్షకు అనుమతిస్తారు. టైర్- 2 లో వారి మెరిట్ ఆధారంగా ప్రతి కాలికి(కేటగిరీల వారీగా) ఐదు మంది అభ్యర్థుల నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
టైర్ - 3 : ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
దరఖాస్తు ఫీజు:
అండ్ రిజర్వుడ్ / ఓ బి సి/ ఈ డబ్ల్యూ ఎస్ లకు పరీక్ష ఫీజు రూ.500/-,
మహిళ/ ఎస్సీ/ ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు. వారు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.20/- చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.07.2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.08.2021.
అధికారిక వెబ్సైట్: http://www.asrb.org.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://online.cbexams.com/asrbaofaojulreg2021/default.aspx
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment