UPSC Recruitment 2021 || ఇంటర్ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన || అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి..
ఇంటర్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ విద్యార్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు భారతీయ అవివాహిత అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 11, 2022.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 400
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★నేషనల్ డిఫెన్స్ అకాడమీలో..
ఆర్మీ - 208 (10 మహిళలకు),
న్యావి - 42 (03 మహిళలకు),
★ఎయిర్ ఫోర్స్ లో..
ఫ్లయింగ్ - 92 (02 మహిళలకు),
గ్రౌండ్ డ్యూటీ(టెక్) - 18 (02 మహిళలకు),
గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్) - 10 (02 మహిళలకు),
★ నావెల్ అకాడమీ (10+2 క్యాడర్ ఎంట్రీ స్కీం) లో.. 30 (పురుషులకు మాత్రమే).. ఇలా మొత్తం 400 ఖాళీల భర్తీకి భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత ప్రమాణాలు: ఆర్మీ పోస్టులకు; ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ విద్యార్హత. ఎయిర్ ఫోర్స్, లెవెల్ వింగ్స్ పోస్టులకు; ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాప్ సబ్జెక్టులను తప్పనిసరిగా చదివి ఉండాలి.
వయసు: జూలై 2, 2003 నుండి జూలై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
పరీక్ష సెంటర్ల వివరాలు: భారతదేశం అంతటా పరీక్ష సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల వారికి; హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్ మొదలగునవి..
దరఖాస్తు ఫీజు : జనరల్ లకు రూ.100.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్ఎస్బి టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.01.2022,
పరీక్ష తేదీ: 10.04.2022,
కోర్సు ప్రారంభ తేదీ: 02.01.2023..
అధికారిక వెబ్సైట్: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://upsconline.nic.in/mainmenu2.php#
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment