NPCIL Graduate Engineering Recruitment 2021 | Apply various posts of 55,000 salary | Check eligibility criteria and Online apply here..
NPCIL ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది!.
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు నియామకానికి ప్రకటనను విడుదల చేసింది.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన NPCIL సంస్థలలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన నియామకాలను వచ్చే సంవత్సరం (2022) లో చేపట్టనున్నారు.
NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను గేట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నట్లు NPCIL ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా ఈ నియామకాలను 2022 గేట్ ఫలితాల తర్వాత నిర్వహిస్తారు.
ప్రస్తుతం గేట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు సిద్ధమవ్వాలని, అదేవిధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ముందుగా అలర్ట్ చేస్తుంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్: https://npcilcareers.co.in/
NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ET-2022) నియామకాలకు సంబంధించి ముఖ్య సమాచారం:
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ET-2022) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ మొదలగు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించింది.
విద్యార్హత: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/ దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే 2020/ 2021/ 2022 గేట్ స్కోర్ ను కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను 2020/ 2021/ 2022 గేట్ కార్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
జీతం: రూ.55,000/- ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 10.04.2022.
అధికారిక వెబ్సైట్: https://npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment