CIPET CSTS Free Placement Oriented Skill Development Program for Un Employed SC ST Youth 2022 || Check eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాద్ చర్లపల్లి లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) ప్లేస్మెంట్ ఓరియంటెడ్ శిక్షణా కార్యక్రమం కోసం తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31 లోగా దరఖాస్తులను చేయవచ్చు.
భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోనే పెట్రోకెమికల్స్ మరియు అనుబంధ పరిశ్రమ స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ సపోర్ట్ సర్వీసెస్, అకాడమిక్ అండ్ రీసెర్చ్(STAR) కి అంకితమైన భారత ప్రాథమిక జాతీయ సంస్థ కు సంబంధించి CIPET-హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన టువంటి అర్హులైన ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల కోసం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్(NSSH) ఆసక్తి కలిగిన తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల నుండి "నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం అనంతరం ప్లేస్మెంట్ అవకాశం ఉండే" 'మెషిన్ ఆపరేటర్(టూల్ రూమ్)' ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా ఆహ్వానిస్తుంది.
ఖాళీల సంఖ్య: 30,
శిక్షణ వ్యవధి: 6 నెలలు,
శిక్షణ కాలంలో ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పించారు.
అర్హత: కనీసం 8వ తరగతి పాస్ తో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్థానిక తెలంగా అభ్యర్థులు అర్హులు.
అసిఫాబాద్, భూపాలపల్లి, మరియు ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లాస్టిక్ మరియు పెట్రోకెమికల్స్ అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఈనెల 31, 2022 కు ముందు అందే విధంగా పంపించాలి.
ఎంపీక కు సంబంధించి రిఫరెన్స్ కాల్ బయోడేటా లో పేర్కొన్న మొబైల్ నెంబర్ కు వస్తుంది-గమనించండి.
సందేహల నివృత్తి కోసం 9959333417, 7893586494, 9092637088, 8978480214, 9445035650. నెంబర్లకు సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.
అధికారిక వెబ్సైట్: https://www.cipet.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు పంపించడానికి చిరునామా: cipethydstc@gmail.com .
దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ: 31.01.2022.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment