Sainik School Administrative Staff on Regular Basis Recruitment 2022 || Check eligibility and Apply here..
సైనిక్ స్కూల్ నలంద రెగ్యులర్ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల, అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు. జనవరి 22, 2022 దరఖాస్తులు చేరడానికి చివరితేదీ.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సైనిక్ స్కూల్ నలంద, రెగ్యులర్ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 01,
పోస్ట్ పేరు: అప్పర్ డివిజన్ క్లర్క్(UDC),
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో, నిమిషానికి 40 పదాలను (ఇంగ్లీషులో) మరియు 35 పదాలను (హిందీలో) కంప్యూటర్ పై టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయసు:
జనవరి 22, 2022 నాటికి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
జీతం:
7th CPC Level-4 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్సులు కనిపిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ధరఖాస్తు ఫారములు డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పైన మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్ ను అంటించి, సంబంధిత వివరాలతో దరఖాస్తులను పూర్తిచేసి, తిరిగి చెల్లించాలని డిమాండ్ డ్రాఫ్ట్ ₹.500/-(జనరల్/ ఓబిసి) ₹.300/-(ఎస్సీ /ఎస్టీ) ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ నలంద వారికి చెల్లించి, ఈ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును, నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలి.
ఎంపిక ప్రక్రియ:
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు వారికి మాత్రమే రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ లను నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఈ విధంగా ఎంపిక విధానం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దరఖాస్తులు పంపించడానికి చిరునామా:
Principal, Sainik School Nalanda, Vill-Nanand, PO-Pawapuri, Dist-Nalanda, State-Bihar, pin Code-803115. అడ్రస్ కు నోటిఫికేషన్లో పేర్కొన్న చివరితేదీ కు ముందు చేరే విధంగా పంపించాలి.
అధికారిక వెబ్సైట్: https://sainikschoolnalanda.edu.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment