TS Medical Staff Recruitment 2022 || Medical Officer | Staff Nurse | Pharmacist | Computer Operator | Accountant | Vacancies are there || Check eligibility and Selection process here..
నేషనల్ హెల్త్ మిషన్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం మేడ్చల్, ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది నియామకాలకు, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 24 జనవరి 2022 సాయంత్రం 4:00 వరకు సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 33,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
మెడికల్ ఆఫీసర్ (పార్ట్ టైం) - 01,
మెడికల్ ఆఫీసర్(ఫుల్ టైం) - 19,
స్టాఫ్ నర్స్ - 07,
ఫార్మాసిస్ట్ - 02,
కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ /అకౌంటెంట్ - 04.. మొదలగునవి.
విద్యార్హత ప్రమాణాలు:
మెడికల్ ఆఫీసర్(పార్ట్ టైం/ ఫుల్ టైం) ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబిబియస్ ఉత్తీర్ణతతో, ఆంధ్ర ప్రదేశ్/ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు విద్యార్హత: జిఎన్ఎం నర్సింగ్/ బిఎస్సి నర్సింగ్ ఉత్తీర్ణతతో, AP/TS నర్సింగ్ కౌన్సిల్ నందు నమోదు కలిగి ఉండాలి.
ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో బి.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.
కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్/ అకౌంటెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీకాం ఉత్తీర్ణత తో రెండు సంవత్సరాల కంప్యూటర్ అనుభవం ఉండాలి.
వయసు: 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలకు మించకుడదు. అధిక వయో పరిమితి కలిగిన, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ విద్యార్హతలకు కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.
దరఖాస్తు ఫీజు: ₹.500/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.01.2022
దరఖాస్తులకు చివరి తేదీ: 24.01.2022.
అధికారిక వెబ్సైట్: https://medchal-malkajgiri.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ (Old): డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment